మాగంటి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారుు. కష్టపడి అంచెలంచెలుగా రాజకీయంగా పైకి ఎదిగి వచ్చిన వ్యక్తి మాగంటి గోపీనాధ్ అని కేసీఆర్ కొనియాడారు. చిన్నవయసులోనే మరణించడం తనకు దిగ్బ్రాంతి కలిగించిందన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ...
ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తనకు వ్యక్తిగతంగా తీవ్ర లోటు అని కేసీఆర్ అన్నార. నిత్యం మాగంటి గోపీనాధ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేవారని, సౌమ్యుడిగా ఆయన తన పనులను చేయించుకునే వారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ను ఎంతో అభివృద్ధి చేయడంలో మాగంటి గోపీనాధ్ పాత్రను మరువలేమన్నారు.