సిటీ సివిల్ కోర్టులకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు స్క్కాడ్ తో పాటు స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Update: 2025-07-08 06:52 GMT

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు స్క్కాడ్ తో పాటు స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సిటీ సివిల్ కోర్టుల్లోని అన్ని కార్యకలాపాలను మూసివేసి కోర్టులో ఉన్న లాయర్లను, మెజిస్ట్రేట్ లను, కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోర్టు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు.

కోర్టు ఆవరణలో...
కోర్టు ఆవరణతో పాటు అన్ని భవనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడకు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో ఈరోజు కేసులున్న వారు ఎవరైనా ఈ ఫేక్ కాల్ కు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News