Hyderabad : హైదరాబాద్ లో మరోసారి హై అలెర్ట్

హైదరాబాద్ లో మరోసారి బాంబ్ స్వ్కాడ్ తనిఖీలను ప్రారంభించింది

Update: 2025-11-12 12:34 GMT

హైదరాబాద్ లో మరోసారి బాంబ్ స్వ్కాడ్ తనిఖీలను ప్రారంభించింది. షాపింగ్ మాల్స్ , బస్టాండ్ లు, టెంపుల్స్ వద్ద ఈ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో సోమవారం బాంబు పేలుడు జరిగి పదమూడు మంది వరకూ మరణించిన నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబ్ స్క్కాడ్ తో తనిఖీలను నిర్వహిస్తున్నారు.

అనుమానంగా ఉన్న...
అనుమానిత వస్తువులు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో ఈ తనిఖీలను క్షుణ్ణంగా చేస్తున్నారు. అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే 100 నెంబరుకు డయల్ చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అద్దెకు దిగిన వారు అనుమానస్పదంగా ఉన్నా, వ్యవహరిస్తున్నా సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు పెద్దయెత్తున నగరంలో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లో హై అలెర్ట్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News