Hyderabad : హైదరాబాద్ లో రెండు రోజులు మద్యం దుకాణాల బంద్

మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను హైదరాబాద్ నగరంలో బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2025-09-04 04:41 GMT

మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను హైదరాబాద్ నగరంలో బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలను, వైన్ షాపులను రెండు రోజుల పాటు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీ ఉదయం నుంచి ఏడో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.

రెండురోజల పాటు బంద్
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని మద్యం దుకాణాలతో పాటు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంచాలని నిర్ణయించారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


Tags:    

Similar News