Heavy rain: హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలయింది.

Update: 2022-09-26 13:08 GMT

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేశారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి వర్షం మొదలయింది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, ఆబిడ్స్, గోల్కొండ, ఎల్బీనగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది.

విద్యుత్ సరఫరాకు అంతరాయం....
దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. విధులు ముగించుకుని కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు సయితం ఇబ్బంది పడుతున్నారు. రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు చేయకున్నా వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.


Tags:    

Similar News