అరుంధతిరెడ్డికి ఘన స్వాగతం
మహిళా ప్రపంచకప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో ఒకరైనా ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డికి గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి మహిళా ప్రపంచకప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో ఒకరైనా ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డికి గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలా దేవి అరుంధతిని ఆత్మీయంగా స్వాగతించారు.
జట్టులో భాగస్వామి కావడం...
ప్రపంచకప్ విజేత జట్టులో భాగమవడం తన కల నిజమైనట్టే అనిపించిందని, ఈ విజయానికి మొత్తం జట్టు కృషే మూలం అని అక్కడే మాట్లాడిన అరుంధతి రెడ్డి తెలిపారు. జట్టు కోచ్ అమోల్ మజుందార్ ఈ గెలుపునకు కారణమని ఆమె వివరించారు. ఫైనల్ పోరు అద్భుతంగా సాగిందని, ఆ క్షణాలు మరచిపోలేనివని, ఈ విజయం మహిళా క్రికెట్‌కు కొత్త దశను తెస్తుందని, యువతులు పెద్ద కలలు కనడానికి ప్రేరణగా నిలుస్తుందని అరుంధతి అన్నారు.