Hyderabad : గేటెడ్ కమ్యునిటీలకు ఆదరణ కరువు.. వాటికే డిమాండ్ అట
హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యునిటి కంటే తక్కువ ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి
gated communities in hyderabad
హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యునిటీని ప్రజలు కోరుకుంటున్నారా? లేక తక్కువ సంఖ్యలో ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ ఉన్న వాటినే ఎంచుకుంటున్నారా? అన్న ప్రశ్నకు రెండోదానిపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గేటెడ్ కమ్యునిటీలో ఫ్లాట్స్ కొనుగోలు చేయాలంటే హైదరాబాద్ నగరానికి కొంత దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు అపార్ట్‌మెంట్స్ లో ఫ్లాట్స్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. వారి వారసులందరూ విదేశాల్లో స్థిరపడటం, తాము ఇక్కడే ఉండి పోవడంతో కొంత ఫ్లాట్స్ అయితే భద్రత ఉంటుందని నమ్ముతున్నారు. సెక్యూరిటీ పరంగా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఫ్లాట్స్ బెటర్ అని నమ్ముతున్నారు. అయితే నెలవారీ నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండటంతో గేటెడ్ కమ్యునిటీలో ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు.