ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షి తగలడంతో పైలెట్ సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఇండిగో ఎయిర్ పోర్టులో సుమారు 164 మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. పైలట్ చాకచక్యంగా వహరించి విమానాన్ని ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండింగ్ చేశారు.
పక్షి తగలడంతో...
దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పక్షి తగలడంతో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని, పైలట్ కూడా వెంటనే అప్రమత్తమై సేఫ్ గా ల్యాండింగ్ చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలదేని ఇండిగో సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొత్తం మీద ఇండిగో విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అధికారులతో పాటు ప్రయాణికులు కూడా రిలీఫ్ ఫీల్ అయ్యారు.