Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది

Update: 2025-06-30 02:09 GMT

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. దీంతో విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన విమానాన్నిఎయిర్ ట్రాఫిక్ కారణంగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించాల్సి వచ్చింది. ఇండిగో విమానం పూణె నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది.

గన్నవరం వెళ్లి...
ఆదివారం ఉదయం పూణె నుంచి ఉదయం 8.43 గంటలకు బయలుదేరిన విమానం ఉదయం పది గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాల్సి ఉంది. అయితే భారీగానెలకొన్న ఎయిర్ ట్రాఫిక్ తో విమానం ల్యాండింగ్ కు అవకాశం లేకపోవడంతో విజయవాడకు మళ్లించారు. అక్కడి నుంచి రెండు గంటల తర్వాత మధ్యాహ్నం 12.38 గంటలకు శంషాబాద్ చేరుకుంది. దీంతో ప్రయాణికులు రెండు గంటల ఆలస్యంగా తమ గమ్యస్థానాలకుచేరుకోవాల్సి వచ్చింది.


Tags:    

Similar News