Hyderabad : విద్యుత్తు శాఖ ఏడీఈ బంధువుల ఇంట్లో రెండు కోట్ల నగదు

హైదరాబాద్ విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి

Update: 2025-09-16 12:53 GMT

హైదరాబాద్ విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మొదలయిన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అంబేద్కర్ నివాసంలోనూ, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీగా నగదు ఈసోదాల్లో బయటపడినట్లు సమాచారం.

ఏసీబీ సోదాల్లో...
అంబేద్కర్ బంధువు ఇంట్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో రెండు కోట్ల రూపాయల నగదు బయటపడింది. కరెన్సీ కట్టలు బయటపడటంతో వాటటిని మనీ కౌంటింగ్ మెషిన్లు తెప్పించి కౌంట్ చేశారు. దీంతో పాటు భారీగా ఆస్తులను అక్రమార్జన ద్వారా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అంబేద్కర్ ఇబ్రహీం బాగ్ లో ఏడీఈగా పనిచేస్తున్నారు. అంబేద్కర్ కు నగరంలో మూడు ప్లాట్లు ఉన్నాయని, గచ్చిబౌలిలో ఖరీదైన భవనం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాల్లో బయటపడింది.


Tags:    

Similar News