గోల్డ్ మెడల్ కొట్టిన నటి ప్రగతి
వెండితెరపై విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రగతి 50 ఏళ్ల వయసులో జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచారు.
వెండితెరపై విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రగతి 50 ఏళ్ల వయసులో జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచారు. కేరళ వేదికగా ఇటీవల జరిగిన 'నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025'లో ప్రగతి పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించారు. మరో రెండు విభాగాల్లోనూ పతకాలను గెలుచుకున్నారు. గతేడాది జరిగిన సౌత్ ఇండియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ఆమె, ఈసారి ఏకంగా జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచారు. ప్రగతి స్క్వాట్‌లో 115 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 50 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 122.5 కిలోల బరువులను ఎత్తారు.