Hyderabad: ఎయిర్ పోర్టు దారిలో అతి చేస్తూ!!

ఈ వ్యక్తులు విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం

Update: 2025-06-24 08:27 GMT

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సమీపంలో ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తూ మోటార్‌సైకిల్‌పై అతివేగంగా, నిర్లక్ష్యంగా ప్రయాణించిన ఎనిమిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. OKR రోడ్డులో ఎనిమిది మంది ద్విచక్ర వాహనంపై కూర్చుని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్నారని సమాచారం అందిందన్నారు పోలీసులు. ఇలాంటి పనులు ఇతరుల ప్రాణాలకు, వారి ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా, వేగంగా ఉన్నాయని ఈ వ్యక్తులు విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించడానికి ఒక బృందాన్ని పంపామని, వారిని పట్టుకుని RGIA పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.


Tags:    

Similar News