ఎల్బీనగర్ లో భారీగా గంజాయి పట్టివేత

తాజాగా ఎల్బీనగర్ లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది. సుమారు 200 కిలోల..

Update: 2023-07-04 06:55 GMT

cannabis smuggling

తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వినియోగాన్ని రూపుమాపేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. స్మగ్లర్లు మాత్రం వివిధ మార్గాల్లో అక్రమంగా వాటిని సరఫరా చేస్తూనే ఉన్నారు. ఫలితంగా యువత వాటికి బానిసలవుతూ నేరాలకు పాల్పడి జైలు పాలవుతోంది. తాజాగా ఎల్బీనగర్ లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది. సుమారు 200 కిలోల గంజాయిని తరలిస్తూ.. స్మగ్లర్లు పోలీసుల చేతికి చిక్కారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 కార్లు, 6 మొబైల్స్ ను సీజ్ చేశారు.

నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో.. బురుండీ నుంచి వచ్చిన మహిళను తనిఖీ చేయగా.. రూ.14.2 కోట్ల విలువైన హెరాయిన్ లభ్యమైంది. మహిళ ధరించిన దుస్తులకు ఉన్న గుండీలు, సబ్బుల లోపల, ఆమె చేతికి ఉన్న సంచిలో ఉన్న ప్రత్యేక అరల్లో అధికారులు గోధుమరంగులో ఉన్న పదార్థాన్ని గుర్తించారు. దానిని బయటకు తీసి పరీక్షలు చేయగా.. అది హెరాయిన్ అని తేలింది. మొత్తం 2,027 గ్రాముల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకుని, మహిళను అరెస్ట్ చేశారు. దాని విలువ రూ.14.2 కోట్లు ఉంటుందని తెలిపారు.


Tags:    

Similar News