Ys Jagan : రేపు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేపు సీబీఐ కోర్టుకు తాను హాజరవుతానని ఇప్పటికే న్యాయస్థానానికి తెలిపారు. జగన్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవ్వం లేదని, డిశ్చార్జి పిటీషన్లపై రోజు వారీ విచారణ జరుగుతున్నందున జగన్ ప్రత్యక్షంగా హాజరు కావాలని సీబీఐ కోరింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో...
అయితే ఈసారి కూడా తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపును ఇవ్వాలని జగన్ కోరగా అందుకు కోర్టు సమ్మతించలేదు. దీంతో ఈ నెల 21వ తేదీన తాను సీబీఐ కోర్టుకు హాజరవుతానని తెలిపారు. ఆయన గత నెల లండన్ పర్యటనకు వెళుతున్న సందర్భంగా అనుమతి తీసుకున్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించడం, సీబీఐ వ్యక్తిగత హాజరు మినహాయింపుకు అభ్యంతరం చెప్పడంతో రేపు వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు.