Hyderabad : నేడు కోకాపేట భూముల వేలం
హైదరాబాద్ లో నేడు కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం జరగనుంది
హైదరాబాద్ లో నేడు కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం జరగనుంది. ఈరోజు హెచ్ఎండీఏ నిర్వహించే వేలంలో 19,20 ప్లాట్ నంబర్స్ లో వేలం వేయనుంది. మొత్తం ఎనిమిది ఎకరాల్లో వేలం నిర్వహించనుంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ప్రభుత్వానికి 2,708 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
రికార్డు ధర లభించడంతో...
కోకాపేట నియో పోలిస్ భూములకు రికార్డు స్థాయి ధరలు పలికాయి. ఎకరం 151 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ భూమి బంగారం అని భావించిన రియల్టర్లు వేలంలో పోటీ పడి ధరలను పెంచుతూ పోతున్నాయి. ఈ సారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతలుగా ఈ వేలం వేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్్ణయించారు. కోకాపేట్ లోని 29 ఎకరాలు, మూసాపేట్ లో పదిహేను ఎకరాల భూమికి వేలం వేయనున్నారు.