డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు

Update: 2025-12-27 06:08 GMT

డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. మసాబ్ ట్యాంకు డ్రగ్స్ కేసులో ఆయన పేరు దర్యాప్తులో వెల్లడయింది. దీంతో ఈగల్ టీం పోలీసులు అమన్ ప్రీత్ కోసం గాలిస్తున్నారు. తన కోసం వెతుకుతున్నారని తెలిసిన వెంటనే అతను పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి...
ఈ కేసులో డిసెంబరు 17వ తేదీన ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విని అరెస్ట్ చేశారు. వీరిద్దరిని విచారించడంలో అమన్ ప్రీత్ పేరు బయటకు రావడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అమన్ ప్రీత్ డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇద్దరు వ్యాపారుల నుంచి 43 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరో నలుగురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది.


Tags:    

Similar News