ఫ్యాక్ట్ చెక్: కోల్‌కతాలో క్లౌడ్ బరస్ట్ ని వైరల్ వీడియో చూపించడం లేదు, ఇది గౌహాటి కి చెందినది
భారీ వర్షాల కారణంగా కోల్‌కతా పరిసర ప్రాంతాలలో వరదలు సంభవించాయి. ఈ ఘటనల కారణంగా 11 మంది మరణించారు. నీటిలో మునిగిపోయిన
Kolkata cloudburst
భారీ వర్షాల కారణంగా కోల్‌కతా పరిసర ప్రాంతాలలో వరదలు సంభవించాయి. ఈ ఘటనల కారణంగా 11 మంది మరణించారు. నీటిలో మునిగిపోయిన కరెంట్ వైర్ల కారణంగా అనేక మంది విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. సెప్టెంబర్ 23, 2025న 24 గంటల్లో కోల్‌కతాలో 251.4 మి.మీ వర్షం కురిసింది. ఇది 1986 తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతంగా రికార్డు సృష్టించింది.
ఇంతలో, కోల్‌కతాలో మేఘావృతాన్ని చూపిస్తుందని చెబుతూ, రైల్వే లైన్ దగ్గర భారీగా నీరు ఎగసిపడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “మేఘాల నుండి జారిపడ్డ వర్షంనీరు వింతగా చూస్తున్న జనం | Viral Video | CVR NEWS SHORTS” అంటూ వీడియోను పోస్టు చేశారు.
“কলকাতায় দেখা গেল মেঘভাঙ্গা বৃষ্টি।এই দৃশ্য দেখতে ভিড় জমিয়েছে অনেকে।।“ అంటూ బెంగాళీలో కూడా వీడియోలను పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో గౌహతిలో పైప్‌లైన్ పేలిన సంఘటనను చూపిస్తోంది.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, గౌహతిలోని చాంద్‌మారిలో ఒక పెద్ద నీటి పైపు పేలినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను మాకు తెలిసింది. సెక్యులర్ ఇండియా న్యూస్ ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం, గౌహతిలోని చాంద్‌మారి లో ఒక పెద్ద నీటి పైపు పేలింది, జుబీన్ గార్గ్ ప్రాంతంలో నీరు నిలిచిపోయాయి. ఈ పేలుడు కారణంగా 70-80 అడుగుల ఎత్తు వరకు నీరు ఎగిరింది, రోడ్లు వరదల్లో మునిగిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. #GuwahatiNews #WaterCrisis #Guwahati #Assam అనే హ్యాష్ ట్యాగ్స్ తో వీడియోలు వైరల్ అయ్యాయి.
గౌహతి ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, సెప్టెంబర్ 20, 2025న గౌహతిలోని చాంద్‌మారిలో ఆకాశంలో నుండి నీరు కిందకు పడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కోల్‌కతాలో మేఘాల విస్ఫోటనం అని పేర్కొన్నారు. గౌహతి సంఘటన జరిగిన 24 గంటల్లో కోల్‌కతాలో దాదాపు 250 మి.మీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ క్లిప్స్ వైరల్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా తీవ్రమైన జలదిగ్బంధం, విమానాల ఆలస్యం, విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయి. పలు మరణాలు కూడా సంభవించాయి.
"కోల్‌కతాలో మేఘాల విస్ఫోటనం" అనే శీర్షికతో ఫేస్‌బుక్‌లో మొదట షేర్ చేయబడిన ఈ వైరల్ వీడియో, Xతో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వ్యాపించింది. ఈ దృశ్యాలు నగరంలోని రుతుపవనాల కారణంగా చోటు చేసుకున్న వర్షానికి సంబంధించినవని చాలా మంది వినియోగదారులు తెలిపారు. పలు మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ ఫుటేజ్‌కు కోల్‌కతా వర్షపాతంతో సంబంధం లేదని తెలిపాయి. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, కీఫ్రేమ్స్ ను విశ్లేషించగా ఈ వీడియో సెప్టెంబర్ 20 నాటి మరొక పోస్ట్ కు సంబంధించిందని తేలింది. ఈ సంఘటన గౌహతిలోని చంద్‌మారిలో జరిగిందని, తాగునీటి సరఫరా పైపు పగిలిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ పేలుడు కారణంగా గాలిలోకి 70–80 అడుగుల ఎత్తుకు నీరు ఎగసిపడి, ఫౌంటెన్ లాంటి పరిస్థితిని సృష్టించిందని స్పష్టం చేసింది. ఈ పైప్ లైన్ పేలుడు వందలాది ఇళ్లకు నీటి సరఫరాకు అంతరాయం కలిగించిందని, లోతట్టు ప్రాంతాలలో వరదలు సంభవించాయని స్థానిక మీడియా నివేదికలు సూచించాయి.
కోల్‌కతాలో భారీ వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సెప్టెంబర్ 23న కురిసిన వర్షాలకు మేఘాల విస్ఫోటనం లాంటి లక్షణాలు ఉన్నాయని నిపుణులు గుర్తించినప్పటికీ, వైరల్ వీడియోకు ఆ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు.
G plus లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 20, 2025న గౌహతిలోని చాంద్‌మారిలో ఆకాశంలో నుండి నీరు కిందకు పడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కోల్‌కత్తాలో మేఘాల విస్ఫోటనం అని చెప్పారు. కోల్‌కత్తాలో 24 గంటల్లో దాదాపు 250 మి.మీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ క్లిప్ వైరల్ అయింది.
అయితే, ఈ ఫుటేజ్‌కు కోల్‌కత్తా వర్షపాతంతో సంబంధం లేదు. సెప్టెంబర్ 20, 2025న గౌహతిలోని చాంద్‌మారిలో పైప్‌లైన్ పగిలిన తర్వాత నీరు పైకి ఎగసిపడుతున్నట్లు వీడియో చూపిస్తుంది. పేలుడు కారణంగా గాలిలోకి 70-80 అడుగుల ఎత్తుకు నీరు ఎగసిపడింది, దీని వలన ఫౌంటెన్ లాంటి ప్రభావం ఏర్పడింది.
గాయకుడు జుబీన్ గార్గ్ మృతికి నగరం మొత్తం దుఃఖిస్తున్న సమయంలోనే, గౌహతిలోని చాంద్‌మారి ఫ్లైఓవర్ సమీపంలో ఒక ప్రధాన నీటి పైపులైన్ పగిలిపోవడంతో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. నివాసితులు, ప్రయాణికులు ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అకస్మాత్తుగా పైప్ లైన్ పగిలిపోవడం వల్ల గాలిలోకి నీరు ఎగసింది, స్ప్రే ఫ్లైఓవర్ పై దాకా కనిపించింది. ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. పేలుడు శక్తి చాలా శక్తివంతంగా ఉండటంతో రాజ్‌గఢ్, జూ రోడ్, రాజ్‌గఢ్, బామునిమైదాం వంటి సమీప ప్రాంతాలలో కూడా నీరు ఎగసిపడింది. పైప్ లైన్ పేలుడు కారణంగా ఏర్పడిన సమస్యను ఎదుర్కోడానికి వాహనాలు వెనక్కి తగ్గడంతో చాంద్‌మారి ప్రాంతంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. పాదచారులు కూడా దాక్కోడానికి పరుగెత్తారు. స్థానికులు ఈ అసాధారణ దృశ్యాన్ని చూడటానికి గుమిగూడారు.
కాబట్టి, వైరల్ వీడియో సెప్టెంబర్ 20, 2023న గౌహతిలోని చాంద్‌మిరిలో జరిగిన పైప్‌లైన్ పేలిన వీడియో. ఇది కోల్‌కత్తాలో మేఘాల విస్ఫోటానికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : కోల్‌కతాలో ఒకే ప్రదేశంలో క్లౌడ్ బరస్ట్ అవడం వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Fact Check : Unknown