ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని రియాజ్‌ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గా తప్పుగా షేర్ చేస్తున్నారు

హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని రియాజ్‌ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ గా

Update: 2026-01-25 18:42 GMT

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నిజామాబాద్‌లో దొంగ అయిన రియాజ్‌పై 60కిపైగా బైక్ చోరీ, చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు.

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో నిందితుడు రియాజ్‌(24) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అతడి మరణాన్ని ధృవీకరించారు. నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్‌ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా అక్కడిక్కడే మృతి చెందాడని డీజీపీ శివధర్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. పోలీసుల దగ్గర ఉన్న వెపన్‌ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడని, అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఒకవేళ రియాజ్‌ గన్‌పైర్‌ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు.

రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

వాటిని ఇక్కడ చూడొచ్చు. ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది.



వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

వైరల్ పోస్టులోని ఫోటోను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఎస్. చైతన్య కుమార్, ఐపీఎస్‌ కు సంబంధించిన చిత్రాలు మాకు లభించాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌లోని ఆ అధికారి ప్రొఫైల్ ఎస్ చైతన్య కుమార్‌ను సౌత్ ఈస్ట్ జోన్ డిసిపిగా తెలిపారు.

https://hyderabadpolice.gov.
in/dcp/southeastzone_dcp.html




 

ఆయన సోషల్ మీడియా ఖాతాను కూడా మేము పరిశీలించాం.

ఆయన ట్విట్టర్ ఖాతా డీపీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఒకటేనని నిర్ధారించాం.



 


ఆయనకు సంబంధించిన మీడియా కథనాల కోసం వెతికాం.

అక్టోబర్‌ 25, 2025న తుపాకీ కాల్పులు హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ లో దొంగ అన్సారీ సెల్‌ ఫోన్‌ చోరీ చేసి పారిపోతుండగా డీసీపీ చైతన్య తన గన్‌మ్యాన్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మ రక్షణ కోసం చైతన్యకుమార్‌ తన గన్‌ మ్యాన్‌ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. డీసీపీ చైతన్య కుమార్, గన్‌మెన్ మూర్తి 750 మీటర్లు నిందితులను చేజ్ చేశారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారు. నిందితుడు ఒమర్ అన్సారీ పై 22 కేసులు ఉన్నాయి. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీషీట్ ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పలు కథనాలను
ఇక్కడ
, ఇక్కడ మీరు చూడొచ్చు.




 


పలు మీడియా కథనాలలో ఉపయోగించిన ఫోటో, వైరల్ ఫోటోలలో ఉన్న డీసీపీ చైతన్య ఒక్కరేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇక వైరల్ చిత్రంలో ఉన్న యూనిఫామ్ ను నిశితంగా పరిశీలించగా ఫోటోలోని ఐపిఎస్ చిహ్నంతో సహా యూనిఫాం, కానిస్టేబుల్ హోదాకు సంబంధించింది కాదని తెలుస్తోంది.

ఇక కానిస్టేబుల్ ప్రమోద్ కు సంబంధించిన పలు ఫోటోలను మీరు మీడియా కథనాల్లో చూడొచ్చు. వైరల్ ఫోటోలో ఉన్నది ప్రమోద్ కాదని స్పష్టంగా తెలుస్తోంది.

https://www.sakshi.com/telugu-news/telangana/big-twist-nizamabad-constable-pramod-case-2599296

https://hyderabadmail.com/riyaz-custody-nizamabad-constable-pramod-murder/

https://telugu.timesnownews.com/news/constable-pramods-family-to-get-rs-1-crore-compensation-we-will-crack-down-on-the-culprits-strictly-dgp-shishadhar-reddy-article-౧౫౩౦౨౮౩౦౯



 



కాబట్టి, హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ అని తప్పుగా షేర్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.


Claim :  హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ చిత్రాన్ని కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News