ఫ్యాక్ట్ చెక్: పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోలేదు

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడి ఆశీర్వాదం

Update: 2026-01-27 02:49 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొంటూ ఉన్నారు.


అయితే చంద్రబాబు నాయుడు కాళ్లకు పవన్ కళ్యాణ్ నమస్కరిస్తున్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “భవిష్యత్తులో MLA అవ్వడానికి నా కష్టాలు” అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను షేర్ చేశారు. ఆ లింక్స్ ను
ఇక్కడ
, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు


వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ ఫోటోను డిజిటల్ గా సృష్టించారు.

చంద్రబాబు నాయుడు పాదాలకు పవన్ కళ్యాణ్ నమస్కరించిన ఫోటోల కోసం మేము వెతికాం. అయితే అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల అధికారిక పేజీలో మాకు ఈ ఫోటోలు లభించలేదు. మీడియా కథనాల కోసం కూడా వెతకగా మాకు ఎలాంటి ఫలితాలు లభించలేదు.

వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు "Bahujana JanaSena YuddhaBheri in Hyderabad. #PawanKalyan #Mayawati #JanaSenaParty #BSP" అనే టైటిల్ తో జనసేన పార్టీ అధికారిక పేజీలో అప్లోడ్ చేసిన పలు ఫోటోలు లభించాయి. ఏప్రిల్ 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. -

Full View


అందులో ఒక ఫోటోలో మాయావతి కాళ్లకు పవన్ కళ్యాణ్ నమస్కరిస్తూ కనిపించారు. ఆ ఫోటోను ఇక్కడ చూడొచ్చు.



 



పలు మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. 2019 ఏప్రిల్ నుండి పవన్ కళ్యాణ్ మాయావతి కాళ్లు మొక్కిన ఫోటోలు, వీడియోలు ఆన్ లైన్ లో ఉన్నాయి.

Full View


Full View



ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ స్పందించారు కూడా. ఉత్తరప‍్రదేశ్‌లాంటి రాష్ట్రంలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్లు మొక్కినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 లో వివరణ ఇచ్చారు. ఆ కథనాలను
ఇక్కడ
, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 



 


పవన్ కళ్యాణ్ మాయావతి కాళ్లకు మొక్కుతున్న ఫోటోను వైరల్ ఫోటోలో ఉపయోగించారని ఆయన వేసుకున్న డ్రెస్, చెప్పులు బట్టి స్పష్టంగా తెలుస్తోంది.




 



వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2023, జనవరిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును కలిసిన ఫోటోలు మాకు లభించాయి. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 



 


ఈ ఫోటోలో ఉన్న చంద్రబాబు నాయుడు పాదాల మీద పవన్ కళ్యాణ్ పడ్డట్టుగా ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆ రెండు ఫోటోలను ఇక్కడ చూడొచ్చు.



 

గతంలో కూడా ఈ ఫోటో వైరల్ అవ్వగా వాటిని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండించాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు. 

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కరించినట్లుగా ఫోటోను మార్ఫింగ్ చేశారు.


Tags:    

Similar News