ఫ్యాక్ట్ చెక్: సోనియమ్మ దయ వల్ల రూ. 1000 కోట్లు స్విస్ బ్యాంకులో పెట్టానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదు

సోనియమ్మ దయ వల్ల రూ. 1000 కోట్లు స్విస్ బ్యాంకులో పెట్టానని

Update: 2026-01-26 04:42 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. ముఖ్యమంత్రి శ్రీ


"రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రతినిధి బృందం సఫలీకృతమైంది. హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఆ నేపథ్యంలో లో పెట్టుబడులకు మించి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై విజన్ లక్ష్యాలు, బృహత్ ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకుంది." అంటూ తెలంగాణ సీఎంఓ వివరణను ఇచ్చింది. మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం మూడు రోజుల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన ముగిసిందని అధికారిక ప్రకటన వచ్చింది.

అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్విస్ బ్యాంకులో అకౌంట్ ను ఓపెన్ చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి సీఎంగా రికార్డు సృష్టించిన రేవంత్
అవినీతి చేసే వాళ్ళ లాగా కాకుండా నిజాయతీగా సంపాదించిన డబ్బుల్ని పెట్టాను
అగ్ర నాయకులు, హీరోల లాగానే నేను కూడా స్విస్ అకౌంట్ సాధించానన్న సీఎం
రైతు బిడ్డగా స్విస్ బ్యాంకులో ఖాతా తెరిచి నందుకు చాలా ఆనందంగా ఉందని వెల్లడి
చిరంజీవి రిఫరెన్స్ సంతకం చేయడంతో స్విస్ అకౌంట్ ఓపెన్ చేసిన అధికారులు
తన అన్నదమ్ముల నెల సంపాదన అయిన రూ.1000 కోట్లు అకౌంట్లో వేసిన సీఎం
సోనియమ్మ దీవెనలతో మరిన్ని పైసలు వేయడానికి మళ్ళీ దావోస్ వస్తానని వెల్లడి
సోనియా, రాహుల్ అకౌంట్స్ పక్కనే తనకు నంబర్ ఇవ్వాలి అభ్యర్థించిన రేవంత్
ఏమయ్యా పొంగులేటి నీ డబ్బులు కూడా ఇవ్వు అంటూ జోక్ వేసిన సీఎం రేవంత్
రేవంత్ రెడ్డితో పాటు స్విస్ బ్యాంక్ని సందర్శించిన ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్" అంటూ పేపర్ క్లిప్పింగ్ లో ఉంది.

ఆ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ పోస్టు లోని కీలక పదాలను ఉపయోగించి మేము గూగుల్ సెర్చ్ చేశాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాంటి ప్రకటన చేసినట్లుగా మాకు ఎలాంటి కథనాలు లభించలేదు. అలాంటి ప్రకటన ఏదైనా రేవంత్ రెడ్డి చేసి ఉంటే అది తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.

ఇక మేము తెలంగాణ స్క్రైబ్ ఈ పేపర్ లో అలాంటి కథనం ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆ తేదీ రోజున ఈ పేపర్ కోసం వెతికాం. అయితే ఈ పేపర్ లేదని తేలింది. కేవలం వెబ్
సైట్ మాత్రమే
తెలంగాణ స్క్రైబ్ పేరున నడుస్తూ ఉంది.

ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. అయితే ఎలాంటి మీడియా కథనాలు మాకు లభించలేదు.

ఇక మా తదుపరి పరిశోధనలో తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అధికారిక సోషల్ మీడియా కథనంలో వైరల్ పోస్టును ఖండిస్తూ వివరణను ఇచ్చారు.

"అధికారిక వివరణ

సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య వార్తలను నమ్మకండి
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఇటీవలి దావోస్ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక తప్పుడు మరియు దురుద్దేశపూర్వక సందేశం ప్రచారమవుతోంది.అందులో ముఖ్యమంత్రిగారు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు, కొన్ని పనులు చేసినట్లు అందులో తప్పుగా చిత్రీకరించారు.

ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం.

ముఖ్యమంత్రి గారు స్విట్జర్లాండ్‌లో ఎలాంటి బ్యాంక్ ఖాతా తెరవలేదు.

ఏ వేదికపై కూడా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
అధికారిక పర్యటనను అడ్డం పెట్టుకుని, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే ఎవరో కావాలని ఈ తప్పుడు సమాచారాన్ని సృష్టించారు.

ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దు, ఇతరులకు షేర్ చేయవద్దు.

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

దావోస్ పర్యటనలోని అసలు వాస్తవాలు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో ‘తెలంగాణ రైజింగ్’
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మూడు రోజుల పర్యటనను గురువారం విజయవంతంగా ముగించింది." అంటూ వివరించారు.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  అలాంటి ప్రకటన ఏదీ రేవంత్ రెడ్డి చేయలేదు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News