ఫ్యాక్ట్ చెక్: ఏఆర్ రెహమాన్ పై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇటీవలివి కావు

రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు. నేను ప‌ట్టించుకోను. ప‌దేళ్ల‌కు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్ అందుకుంటారు

Update: 2026-01-26 04:57 GMT

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో వివాదాస్పదం అయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్రసీమలో తనకు అవకాశాలు తగ్గడానికి కేవలం సృజనాత్మక కారణాలే కాకుండా, అంతర్లీనంగా ఉన్న మతపరమైన వివక్ష కూడా ఒక కారణమై ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో అధికార కేంద్రాలు మారాయని, నిర్ణయాధికారం సంగీతం తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్లే తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని అన్నారు. ఒక సినిమా కోసం తనను ఒప్పందం చేసుకున్న తర్వాత, మ్యూజిక్ కంపెనీలు జోక్యం చేసుకుని వేరే సంగీత దర్శకులను తెచ్చుకుంటున్నాయని, ఇది తనను అవమానించడమేనని రెహమాన్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పు పట్టగా మరికొందరు సమర్థించారు.


ఈ వివాదంపై ఏఆర్ రెహమాన్ వివరణ కూడా ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. తన మాటలతో ఎప్పుడూ ఎవరినీ బాధ పెట్టాలని అనుకోలేదన్నారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. భారత్‌ నాకు స్ఫూర్తి. ఈ దేశం నా గురువు, ఇల్లు కూడా. భారతీయుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే, భిన్న స్వరాలతో పనిచేసే అవకాశాన్ని ఈ దేశం కల్పించింది. కొన్నిసార్లు ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసుకున్నానన్నారు రెహమాన్.

ఇలాంటి పరిస్థితుల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏఆర్ రెహమాన్ ను విమర్శించారంటూ కొన్ని వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

"तेलुगू सुपरस्टार नंदमुरी बालकृष्ण ने ए आर रहमान को लगाई फटकार।

उन्होंने कहा -

“मुझे फर्क नहीं पड़ता ए.आर. रहमान कौन है, वह तो बस नकलची है।
10 साल में सिर्फ एक हिट फिल्म देता है और वो भी इस्लामी विचारधारा के चलते पुरस्कार जीतता है।”

हाल ही में एक इंटरव्यू के दौरान ए आर रहमान ने आरोप लगाया है कि भारत में जब से सत्ता परिवर्तन हुआ है तब से मुझे काम नहीं मिल रहा है।

हालांकि जब उसके विक्टिम कार्ड की पोल खुली तो उसने बोला मैं किसी की भावनाओं को ठेस नहीं पहुंचना चाहता था।" అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.

"రెహమాన్ ఎవరో నాకు తెలియదు. నేను పట్టించుకోను. దశాబ్దానికి ఒకసారి, అతను ఒక హిట్ ఇచ్చి ఆస్కార్ అవార్డును పొందుతాడు." అంటూ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

https://www.instagram.com/p/DTwg6GeCdkM/

https://www.instagram.com/reels/DTvcTX_DIcx/

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో నందమూరి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

ఏఆర్ రెహమాన్ బీబీసీ ఇంటర్వ్యూ తర్వాత నందమూరి బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారేమోనని తెలుసుకోడానికి మేము గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎలాంటి రిజల్ట్స్ లభించలేదు.

ఇక సంబంధిత పదాలతో మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాం.

"‘I don’t know who AR Rahman is’: When Nandamuri Balakrishna’s remark raised eyebrows despite their collaboration in Nippu Ravva" అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో జనవరి 24, 2026న వచ్చిన
కథనం
మాకు లభించింది.


2021 ఇంటర్వ్యూలో, నందమూరి బాలకృష్ణ ఆస్కార్ అవార్డు గ్రహీత, స్వరకర్త ఎ.ఆర్. రెహమాన్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయని ఈ కథనంలో ఉంది. తనకు రెహమాన్ తెలియదని, ఆయన విజయాల గురించి పట్టించుకోనని బాలకృష్ణ అన్నారు. టీవీ9తో మాట్లాడుతూ బాలకృష్ణ, “రెహమాన్ ఎవరో నాకు తెలియదు. నేను పట్టించుకోను. దశాబ్దానికి ఒకసారి ఆయన హిట్ ఇచ్చి ఆస్కార్ అవార్డును అందుకుంటారు” అని అన్నారు. బాలకృష్ణ 1993లో విడుదలైన తెలుగు చిత్రం నిప్పు రవ్వకు ఎ.ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. అయినా కూడా ఆయన ఇలా మాట్లాడారని ఆ కథనంలో ఉంది.

దీన్ని క్యూ గా తీసుకుని మేము యూట్యూబ్ లో వీడియో కోసం వెతికాం. మాకు టీవీ9 ఇంటర్వ్యూ లింక్ లభించింది.

AR Rahman ఎవరో నాకు తెలియదు - Balakrishna - TV9 అనే టైటిల్ తో వీడియోను 20 జులై 2021న అప్లోడ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు బాల‌య్య‌. ఇంట‌ర్వ్యూలో భాగంగా ‘ఆదిత్య 369 సినిమాను గమనించారో లేదో ఇళయరాజా మ్యూజిక్ అంటే ఎవరూ నమ్మరు. అది ఇళయరాజా మ్యూజిక్ అంటే! ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది.. అంటూ రెహ‌మాన్ పేరు ఎత్తారు. రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు. నేను ప‌ట్టించుకోను. ప‌దేళ్ల‌కు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్ అందుకుంటారు.. అయినా పట్టించుకోను అన్నారు.

Full View



అప్పట్లో కూడా పలు మీడియా సంస్థలు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 


గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఇటీవలివిగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  ఏఆర్ రెహమాన్ పై నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News