ఫ్యాక్ట్ చెక్: నారా లోకేష్ స్కూల్ బ్యాగ్ మోసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనే కథనం నిజం కాదు
నారా లోకేష్ స్కూల్ బ్యాగ్ మోసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సు ముగిసింది. జనవరి 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఈ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరై ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా సుమారు 400 మంది రాజకీయ నాయకులు, 850 మంది సీఈఓలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు దావోస్‌కు వెళ్లాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ నాలుగు రోజుల దావోస్ పర్యటనను పూర్తి చేసుకుని భారత్‌కు చేరుకున్నారు.
నారా లోకేశ్ స్కూల్ బ్యాగ్ మోసాను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా అన్నారని ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్నట్లుగా న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ న్యూస్ క్లిప్పింగ్ లో "లోకేశ్ స్కూల్ బ్యాగ్ మోసాను
దావోస్ టూర్లో లోకేశిని సత్కరించి, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టీడీపీ బ్రతికుంటే లోకేశ్ సీఎం.. నేను డిప్యూటీ సీఎం అయ్యేవాడిని
లోకేశ్ స్కూల్ బ్యాగులు మోసాను, అందుకే ఈరోజు తెలంగాణాకి సీఎం అయ్యాను
లోకేశ్ తెలంగాణకి సీఎం అవ్వాలనుకున్నారు.. ఈ సన్నాసి కేసీఆర్ అడ్డుపడ్డాడు
ఇప్పటికి నాలో ప్రవహించేది పసుపు రక్తమే.. నా పుట్టిల్లు టీడీపీ, మెట్టినిల్లు కాంగ్రెస్
చంద్రబాబుని జైలులో వేసినప్పుడు వారం రోజులు పాటు నేను అన్నం తినలేదు
తెలంగాణ వాళ్ళు బాబుకి రుణపడి ఉండాలి.. ఆయన వల్లే హైదరాబాద్ ఇలా ఉంది
చంద్రబాబు పీఎం, లోకేశ్ బాబు సీఎం అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ నిలబడి ఉంటే నారా లోకేశ్ ఈరోజు సీఎం అయ్యేవారని, తాను డిప్యూటీ సీఎంగా ఉండేవాడినని రేవంత్ రెడ్డి అన్నారు. "నేను లోకేశ్కు స్కూల్ బ్యాగులు మోసాను, ఆ అనుభవమే నన్ను ఈరోజు తెలంగాణ సీఎం స్థాయికి తీసుకొచ్చింది" అని వ్యాఖ్యానించారు. లోకేశ్ తెలంగాణకు సీఎం కావాలని ఆశపడ్డారని, అయితే, కేసీఆర్ అడ్డంకులు సృష్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎదుగుదలని అడ్డుకునేందుకు అప్పటి పాలకులు పద్ధతిగా వ్యూహాలు రచించారని విమర్శించారు. ఇప్పటికీ నాలో ప్రవహించేది పసుపు రక్తమే. నా పుట్టిల్లు టీడీపీ, మెట్టినిల్లు కాంగ్రెస్" అని వ్యాఖ్యానించారు. బాబును జైలులో వేసినప్పుడు వారం రోజుల పాటు నేను అన్నం తినలేదు. ఆ స్థాయిలో ఆయనంటే నాకు గౌరవం, అభిమానం" అని తెలిపారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉండాలి. ఆయన విజన్ వల్లే హైదరాబాద్ ఈ స్థాయికి ఎదిగింది" అని అన్నారు. చంద్రబాబు దేశ ప్రధాని కావాలి, లోకేశ్ ముఖ్యమంత్రి కావాలి అని నేను దేవుడిని కోరుకుంటున్నాను" అని చెప్పారు. అని ఉంది.
ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎక్కడా కూడా అందుకు సంబంధించిన కథనాలు లభించలేదు.
ఇక వైరల్ న్యూస్‌పేపర్ క్లిప్‌ను నిశితంగా పరిశీలించగా 24 జనవరి 2026 తేదీతో పాటు పేజీ నంబర్ 03 అని ఉంది. 24 జనవరి 2026 నాటి ‘ఆంధ్ర జ్యోతి’ న్యూస్ పేపర్ డిజిటల్ కాపీని తనిఖీ చేసాము. అయితే, ఈ రకమైన కథనం ఎక్కడా కనిపించలేదు.
https://epaper.andhrajyothy.
కీవర్డ్స్ ను ఉపయోగించి ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ లో కూడా ఈ కథనం కోసం వెతికాం. అక్కడా కూడా ఈ కథనం మాకు లభించలేదు.
వైరల్ క్లిప్పింగ్ లోని ఫోటోను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2026, జనవరిలో నారా లోకేష్, రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన ఫోటో అని స్పష్టంగా తెలుస్తోంది. పలు మీడియా సంస్థలు నారా లోకేష్, రేవంత్ రెడ్డి భేటీ గురించి ప్రముఖంగా ప్రచురించాయి. అందుకు సంబంధించిన కథనాలకు ఈ ఫోటోను ఉపయోగించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య భేటీ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్... సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేశ్ ను సత్కరించారు.
పలు మీడియా సంస్థలు యూట్యూబ్ లో కూడా ఈ విజువల్స్ ను ప్రచురించాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారా లోకేశ్ స్కూల్ బ్యాగ్ మోసాను అని అన్నట్లు ఏ నివేదిక కూడా మాకు లభించలేదు.
వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయి. వాటిని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : నారా లోకేష్ స్కూల్ బ్యాగ్ మోసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown