ఫ్యాక్ట్ చెక్: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకుడు అన్నామలై డ్యాన్స్ చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకుడు అన్నామలై డ్యాన్స్

Update: 2026-01-24 05:47 GMT

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో BJP నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించిన తర్వాత, అందరి దృష్టి మేయర్ ఎన్నికపైనే ఉంది. ముంబైతో పాటు, గత వారం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలోని 28 ఇతర నగరాలకు కూడా మేయర్ల ఎన్నిక పెండింగ్ లో ఉంది. మేయర్ ఎన్నికలకు ముందు అనేక మంది ప్రముఖ వ్యక్తుల సమీకరణాలను రిజర్వేషన్ లాటరీ దెబ్బతీసింది, కొత్త ముఖాలకు అవకాశం లభించింది. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఆ మున్సిపల్ కార్పొరేషన్లలో 15 మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళా అభ్యర్థులు ముందంజలో ఉన్నారని చూపిస్తుంది. ముంబైలో మేయర్ పదవి జనరల్ కేటగిరీకి చెందిన మహిళకు రిజర్వ్ చేయబడింది. ముంబై నగరంలో 227 సీట్లలో 89 గెలుచుకుని, BJP అతిపెద్ద పార్టీగా అవతరించింది, శివసేనకు చెందిన షిండే వర్గం 29 సీట్లు గెలుచుకుంది. మెజారిటీ మార్కు (114) దాటిన తర్వాత, మేయర్ బీజేపీ నుండి వస్తారా లేదా షిండే సేన నుండి వస్తారా అనే ప్రశ్న ఇప్పుడు మిగిలిపోయింది.


బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకుడు కె.అన్నామలై 'లుంగి డ్యాన్స్'కు నృత్యం చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై పౌర ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించినందుకు అన్నామలై ఇలా డ్యాన్స్ చేశారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవలిది కాదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఇటీవలి కాలంలో అన్నామలై ఇలా డ్యాన్స్ చేసిన ఘటనకు సంబంధించిన ఫలితాలు లభించలేదు.

వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ‘@nationfirstmedia’ అనే యూట్యూబ్ యూజర్ సెప్టెంబర్ 24, 2023న “Annamalai Latest Dance Video” అనే పేరుతో వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియో ఇటీవలిది కాదని, ఇటీవలి BMC ఎన్నికలకు సంబంధించినది కాదని టైమ్‌లైన్ స్పష్టం చేస్తుంది.

Full View


దీన్ని క్యూగా తీసుకుని సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు 2023, సెప్టెంబర్ లో అప్లోడ్ చేశారని తెలుస్తోంది.

Full View



పలు యాంగిల్స్ లో అన్నామలై డ్యాన్స్ ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాటిని ఇక్కడ చూడొచ్చు.

Full View



ఎన్ మన్.. ఎన్ మక్కల్ అనే యాత్ర సందర్భంగా ఈ డ్యాన్స్ చేశారు అన్నామలై. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడిగా ఉన్న కె.అన్నామలై ఆరు నెలల పాటు పాదయాత్ర చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ యాత్ర జరిగింది. ఈ యాత్రను జూలై 28, 2023న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. తమిళనాడు అంతటా 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయాలని ప్రణాళికలో భాగంగా ఉంది.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. 
Claim :  బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకుడు అన్నామలై డ్యాన్స్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News