ఫ్యాక్ట్ చెకింగ్: స్క్రిప్టెడ్ వీడియోను నిజంగా షాపు యజమాని కస్టమర్ కాళ్ల మీద పడినట్లుగా ప్రచారం చేస్తున్నారు
స్క్రిప్టెడ్ వీడియోను నిజంగా షాపు యజమాని కస్టమర్ కాళ్ల మీద పడినట్లుగా
ఉద్యోగాలు చేయలేక వ్యాపారాలు చేసే వారు కొందరైతే, వ్యాపారమే ప్రపంచంగా బతికేవాళ్లు మరికొందరు. ఉన్న వ్యాపారాన్ని మెరుగుపరుచుకోడానికి ఎంతో మంది పలు వ్యూహాలను అవలంభిస్తూ ఉంటారు. మీ వ్యాపారంలో మెరుగుపరచాల్సిన, మెరుగ్గా పని చేయగల విభాగాలను గుర్తించడంలో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకు సంబంధించి వివిధ వ్యూహాలపై ఎప్పటికప్పుడు పని చేయాల్సి ఉంటుంది. మీ వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు వ్యాపారం ఊపందుకునే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి.
ఒక బట్టల దుకాణంలో మహిళ మరొక మహిళ పాదాలను పట్టుకుని విలపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన వారు, ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన అని చెబుతున్నారు. ఒక కస్టమర్ గంటల తరబడి షాపులో ఉండి.. కొనకుండా వెళ్ళిపోతూ ఉండడంతో దుకాణంలోని మహిళ ఇలా చేసిందంటూ పోస్టులు పెట్టారు.
నెటిజన్లు పలు ప్రదేశాలకు ఆపాదిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
"ముంబయి లో గంటల తరబడి ఎదురుచూసినా ఆశించిన వ్యాపారం జరగకపోవడంతో ఓ చిరు వ్యాపారి తట్టుకోలేకపోయారు. గంటల కొద్దీ వస్తువులు చూసి, చివరకు ఏమీ కొనకుండా వెళ్ళిపోతున్న కస్టమర్‌ను చూసి ఆమె నిస్సహాయత కట్టలు తెంచుకుంది.
"వెళ్ళిపోకండి.. ఏదో ఒకటి కొనండి" అన్నట్లుగా ఆమె కస్టమర్ కాళ్ల మీద పడి రోదించిన తీరు చూసేవారిని కలిచివేస్తోంది. ఎంతో శ్రమతో వస్తువులను ప్రదర్శించినా, కస్టమర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో కలిగిన ఆర్థిక, మానసిక వేదన ఆ మహిళను కుంగదీసింది. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, చిరు వ్యాపారుల కష్టాలపై చర్చకు దారితీస్తోంది.
#m1newstelugu #telugu #instagram #viralvideos #ట్రెండింగ్విడియోస్" అంటూ పోస్టులు పెట్టారు.
ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. స్క్రిప్టెడ్ వీడియోను నిజంగా చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
‘carry_wear_by_besties_ks’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో మాకు లభించింది. ఆ వీడియోలో పాదాల మీద పడి ఏడుస్తున్న మహిళను మరో మహిళ ప్రాధేయపడుతున్న సోషల్ మీడియా పోస్ట్ మాకు లభించింది.
“Everyone tried, will someone do it better #comedyvideos #funny #reelsinstagram #customer #shopkeeper,” అంటూ పోస్టు పెట్టారు.
దీని బట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియో స్క్రిప్ట్ చేయబడి ఉండవచ్చు.
పోస్ట్ లింక్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
“She is saying as if she did not like anything #customer #shopkeeperslife #dukaandar #funny #comedyvideos.” అనే టైటిల్ తో జనవరి 9న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్అవ్వడంతో వారు పోస్టు పెట్టారు.
వీడియోలో కనిపిస్తున్న మహిళలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక పోస్ట్‌లో, తాము దుకాణం యజమానులమని, ఈ సంఘటన నిజం కాదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో రికార్డు చేసినట్లు తెలిపారు. ఇది కేవలం వినోద ప్రయోజనాల కోసం రికార్డ్ చేసినట్లు తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్ అని, వినోద ప్రయోజనాల కోసం సృష్టించినట్లుగా తేలింది. తప్పుడు వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.