ఫ్యాక్ట్ చెక్: ఓ మహిళను మొసలి నీటిలోకి లాక్కుని వెళుతున్న వీడియో నిజమైనది కాదు. అది ఏఐ ద్వారా సృష్టించారు

ఓ మహిళను మొసలి నీటిలోకి లాక్కుని వెళుతున్న వీడియో

Update: 2026-01-26 06:03 GMT

వన్యప్రాణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి తిరుగాడే ప్రాంతాలకు మనం చాలా దూరంగా ఉండాలి. అలాగని వాటి ప్రాంతంలోకి వెళితే మనుషులకు ముప్పు తప్పదు. ముఖ్యంగా మొసలి ఉండే కొలనులు, సరస్సులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అయితే ఈ మొసళ్ళకు మనుషులతోనూ అంతే ప్రమాదం ఉంది. మొసలి చర్మం కోసం భారీ ఎత్తున వేట జరుగుతూ ఉంది. గుజరాత్‌లో ఇటీవల ఒక గ్రామంలోకి వచ్చిన ఐదు అడుగుల పొడవున్న మొసలిని చంపినందుకు వడోదర అటవీ శాఖ జనవరి 24, 2026న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. విఠల్ నాయక్ బిపిన్ నా,యక్ అనే ఇద్దరు నిందితులను ఈ సంఘటనకు సంబంధించిన వైరల్ వీడియోల ఆధారంగా అరెస్టు చేసినట్లు కర్జన్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులు మొసలిని కర్రలతో కొట్టి చంపారు. మరికొందరు వ్యక్తులు వారికి సహాయం చేయడానికి టార్చిలైట్లు వేశారు. ఆ తర్వాత నిందితులు మొసలి మృతదేహాన్ని గ్రామంలోని చెరువులోకి విసిరేశారు. జనవరి 17న కర్జన్ తాలూకాలోని చోర్భుజ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో మరిన్ని నిందితుల ప్రమేయం ఉందా లేదా అని తెలుసుకోవడానికి సంబంధిత శాఖలు దర్యాప్తు చేస్తున్నాయి.

అయితే ఒక మహిళను మొసలి నీటిలోకి లాక్కుని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ మహిళ కేకలు వేస్తూ ఉండగా మొసలి ఆమె నీటి లోకి లాక్కుని వెళ్ళిపోయింది. ఇది నిజమైన ఘటన అంటూ నెటిజన్లు చెబుతూ ఉన్నారు. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 


https://x.com/rajaram_sahu02/status/2011471532640616898

https://www.instagram.com/reels/DTfxU2AFCGo/

https://www.instagram.com/reels/DTfQH19jGqk/

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా ఆ మహిళ హావభావాలు తేడాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా వింతగా అనిపిస్తూ ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం ఆమె చేయి అందుకోడానికి కూడా ప్రయత్నించలేదు. అలాగే ఆమెను రికార్డు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటివి ఏఐ వీడియోలలో సాధారణంగా కనిపించే తప్పులు.

వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు ఈ వీడియో అప్లోడ్ చేసిన అకౌంట్ లభించింది.

https://www.instagram.com/p/DTUUjalETvh/

depto_ai.13 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను చూడొచ్చు. ఈ పేజీలో అన్నీ ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలే ఉన్నాయి. పేజీ పేరులోనే ఏఐ ద్వారా సృష్టించిన వీడియోల కంటెంట్ అంటూ స్పష్టంగా అర్థం అవుతూ ఉంది.

జంతువులు, మనుషులకు సంబంధించిన పలు వీడియోలను ఈ పేజీలో చూడొచ్చు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.


 



ఇక వైరల్ వీడియో ఏఐ అవునా కాదా అని తెలుసుకోడానికి మేము హైవ్ మోడరేషన్ టూల్ ను వాడాం. ఈ వైరల్ వీడియో ఏఐ సృష్టి అని స్పష్టం చేసింది.



 



AI- జనరేటెడ్ కంటెంట్‌ను క్రమం తప్పకుండా షేర్ చేసే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో అప్‌లోడ్ అయింది. ఆ టైమ్‌లైన్‌లో అనేక సారూప్య వీడియోలు అందుబాటులో ఉన్నాయి. AI డిటెక్షన్ టూల్స్ కూడా ఈ వీడియో కృత్రిమ మేధస్సును ఉపయోగించి సృష్టించినట్లుగా సూచిస్తున్నాయి.

పలు నిజ నిర్ధారణ చేసే సంస్థలు కూడా ఈ వైరల్ వీడియో ఏఐ సృష్టి అని తేల్చాయి.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  ఇది నిజమైన వీడియో కాదు. AI జనరేటెడ్ కంటెంట్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News