ఫ్యాక్ట్ చెక్: దుర్గా నవరాత్రుల సమయంలో పూజారి మాంసాహారం తినడం వైరల్ వీడియో చూపిస్తుందనేది నిజం కాదు

దుర్గాదేవిని గౌరవించే తొమ్మిది రోజుల వేడుక నవరాత్రి. దీనిని భారతదేశం అంతటా జరుపుకుంటారు. దుర్గాదేవిని 10 రోజుల పాటూ

Update: 2025-09-25 12:49 GMT

Hindu priest eating meat

దుర్గాదేవిని గౌరవించే తొమ్మిది రోజుల వేడుక నవరాత్రి. దీనిని భారతదేశం అంతటా జరుపుకుంటారు. దుర్గాదేవిని 10 రోజుల పాటూ పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను తొమ్మిది రూపాల్లో కొలుచుకుంటారు. ఇక ఈ ఉత్సవాల సమయంలో చాలా మంది ఉపవాసాలు ఉంటారు. అంతేకాకుండా, అమ్మవారి మాల ధరించి నిష్టగా పూజలు చేస్తుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పూజలు చేయడమే కాకుండా, ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట్లోనూ పూజలు, కమ్మని ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తుంటారు.

ఈ ఉత్సవాల సమయంలో ఒక పూజారి ఒక మూలలో కూర్చుని మాంసాహారం తింటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నవరాత్రి పూజ సమయంలో పూజారి మాంసాహారం తింటున్నాడనే వాదనతో “दुर्गा पूजा का समय चाल रहा है और ये देखिए हमारे पंडित जी को” అంటూ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
“देखिए नवरात्रि में पंडित जी कितने चाव के साथ मांसाहारी भोजन दबा रहे हैं। इनके हाथों से आप पूजा करवाते हैं। घोर कलयुग है। #ViralVideos #Navratri2025”, అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. “నవరాత్రి సమయంలో పూజారి ఎంత చక్కగా మాంసాహారాన్ని తింటున్నారో చూడండి. ఈ చేతులతో మీ పూజను పూర్తి చేసుకోండి. ఇది కలియుగం #ViralVideos #Navratri2025” అంటూ అర్థం వచ్చేలా ఆ పోస్టులు ఉన్నాయి.

వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో స్క్రిప్టెడ్. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఆ వీడియో స్క్రిప్టెడ్ చేసినట్లుగా పేర్కొన్న కొన్ని పోస్ట్‌లను మేము కనుగొన్నాము. ఈ వీడియోలో నేపాలీ హాస్యనటుడు మహేష్ ఉప్రేటి కనిపిస్తారు.
కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోలో కనిపించే వ్యక్తి బ్రాహ్మణులు ధరించే పవిత్ర దారాన్ని సరైన రీతిలో ఉంచలేదని కూడా పలువురు ఎత్తి చూపారు, ఇది వీడియోపై అనుమానాలను రేకెత్తించింది. “This is a scripted video by a Nepali leftist comedian, Mahesh Uprati, it is not real...” అంటూ కామెంట్లు పెట్టడం మేము గమనించాం.
కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ వైరల్ వీడియోను "ఇది నిజంగా పిచ్చితనం" అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఐటీ సెల్ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రణాళికాబద్ధమైన, వ్యవస్థీకృత ఎజెండాను అమలు చేస్తున్నాయి. నేపాలీ వామపక్ష హాస్యనటుడు మహేష్ ఉపాతి తెరకెక్కించిన వీడియోను ఇండి అలయన్స్ ఐటీ సెల్ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తోంది. గతంలో బ్రిటిష్ వారు ఇలాగే చేసేవారు, ఇప్పుడు వారి బ్రౌన్ సిపాయిలు కూడా అలాగే చేస్తున్నారు" అంటూ పోస్టులు పెట్టారు.
కామెంట్లను జాగ్రత్తగా గమనించిన తరువాత, టిక్‌టాక్ యూజర్ మహేష్ ఉప్రేతి స్క్రీన్‌షాట్‌ను ఒక యూజర్ షేర్ చేస్తున్నట్లు మేము కనుగొన్నాము, అతను ఒక కళాకారుడు, గాయకుడు అని చూపిస్తుంది. అతను టిక్‌టాక్‌లో షేర్ చేసిన వీడియో 6 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది.
మహేష్ ఉప్రేతి టిక్‌టాక్ బయో స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది, అందులో అతను ఒక కళాకారుడు/గాయకుడు అని స్పష్టంగా పేర్కొన్నారు.

మేము ఒక YouTube ఛానెల్‌ కూడా లభించింది, అక్కడ అతను అప్లోడ్ చేసిన అనేక ఇతర వీడియోలను కూడా చూశాం.
Full View
వైరల్ వీడియోలోని స్క్రీన్‌షాట్‌లను, మహేష్ ఉప్రేతి ప్రచురించిన వీడియోకు మధ్య పోలిక ఇక్కడ ఉంది.

ఓన్లీ ఫ్యాక్ట్ ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ స్క్రీన్‌షాట్‌లను చూపించే X పోస్ట్‌ కూడా ఇక్కడ చూడొచ్చు.
ఒక పూజారి మాంసాహారం తింటున్నట్లు చూపించే వైరల్ వీడియో నేపాల్ కళాకారుడు సృష్టించిన స్క్రిప్ట్ వీడియో. ఇది భారతదేశానికి చెందినది కాదు లేదా నవరాత్రి వేడుకలకు సంబంధించినది కాదు. నవరాత్రి వేడుకల సమయంలో ఒక పూజారి మాంసాహారం తింటున్నాడనే వాదన నిజం కాదు.
Claim :  దుర్గా నవరాత్రుల సమయంలో ఒక పూజారి మాంసాహారం తింటున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది.
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News