ఫ్యాక్ట్ చెక్: చైనాలో నిర్మించిన బ్రిడ్జిని శ్రీనగర్- ఢిల్లీలను కలిపే NH-44 మీద బీజేపీ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జిగా ప్రచారం చేస్తున్నారు

ఇది భారతదేశంలోని బ్రిడ్జి కాదు. చైనాకు సంబంధించినది

Update: 2026-01-28 10:24 GMT

జమ్మూ కశ్మీర్ లో కనెక్టివిటీని పెంచడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఇప్పటివరకు రూ.32 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 81 కిలోమీటర్ల పొడవున 2 కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టులు ఆమోదించారు. 2024–25లో రూ.1,262 కోట్ల వ్యయంతో 29 కిలోమీటర్ల పొడవున ఐదు ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 11, 2025న లోక్‌సభకు తెలిపింది.


జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నిరంతర ప్రక్రియ అని, ట్రాఫిక్ సాంద్రత, కనెక్టివిటీ అవసరాలు, రహదారి పరిస్థితి ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌తో అమరిక ఆధారంగా పనులు చేపట్టనున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్ర ,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించడం, అప్‌గ్రేడ్ చేయడం కోసం ప్రతిపాదనలను సమర్పిస్తాయి. తరువాత వాటిపై కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ వంతెన అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "ఓటు చోరీ అనే తప్పుడు ఆరోపణల వల్ల కాదు, ఇలాంటి కనిపించే అభివృద్ధి వల్లే మోదీజీ ఎన్నికల్లో గెలుపొందారు" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేశారు.
వైరల్ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు . 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చైనాకు సంబంధించిన విజువల్స్ ను భారత్ లో చోటు చేసుకున్నదిగా ప్రచారం చేస్తున్నారు.


వైరల్ వీడియో లోని కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం. ఇది చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని డఫాకు వంతెనగా పలు సోషల్ మీడియా పోస్టులు తెలిపాయి.

Full View


Full View



మా తదుపరి సెర్చ్ లో చైనీస్ వార్తా సంస్థలు ప్రచురించిన డఫాకు గ్రాండ్ వంతెనకు సంబంధించిన పలు చిత్రాలు కూడా లభించాయి.

చైనా న్యూస్ అక్టోబర్ 20, 2024న ధృవీకరించబడిన హ్యాండిల్ ద్వారా డఫాకు గ్రాండ్ బ్రిడ్జి చిత్రాలను పంచుకుంది. గుయ్జౌ ప్రావిన్స్‌లోని జునిలో ఉన్న 1,427 మీటర్ల పొడవైన వంతెన అని తెలిపింది. ఈ వంతెన రెన్‌హుయ్-జుని ఎక్స్‌ప్రెస్‌వేలో కీలకమైన ప్రాజెక్ట్ అని, జుని, రెన్‌హుయి మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని వివరించారు. ఇది ఇంజనీరింగ్ అద్భుతం అని ప్రశంసలు దక్కాయి.





వైరల్ అవుతున్న వాదనను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.


పర్వతాలలో ఉన్న ఈ ఐకానిక్ ఆర్చ్ వంతెనపై అనేక చైనీస్ వార్తా నివేదికలను కూడా మేము కనుగొన్నాము. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, దఫాక్ గ్రాండ్ వంతెన చైనాలోని నైరుతి ప్రావిన్స్లో ఉంది. నివేదికలలోని ఫోటోలు వైరల్ వీడియోలో కనిపించే వంతెనను పోలి ఉంటాయి.


 



ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ మధ్య ఉన్న చీనాబ్ రైలు వంతెన ఒక ఆర్చ్ రైలు వంతెన. ఇది ప్రజల వినియోగానికి తెరచలేదు. ఇది వైరల్ వీడియోలోని వంతెన కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చైనాకు చెందిన వంతెనను భారత్ కు చెందినదిగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  ఇది భారతదేశంలోని బ్రిడ్జి కాదు. చైనాకు సంబంధించినది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News