ఫ్యాక్ట్ చెక్: నటి కాజల్ అగర్వాల్ ప్రమాదంలో మరణించారనే వార్త అబద్దం
చాలా మంది సెలబ్రిటీలు బతికి ఉన్నా కూడా, వారు చనిపోయారంటూ నకిలీ వార్తలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా వ్యాపించాయి, అవి అభిమాను
Kajal Agarwal
చాలా మంది సెలబ్రిటీలు బతికి ఉన్నా కూడా, వారు చనిపోయారంటూ నకిలీ వార్తలు ఆన్‌లైన్‌లో విస్తృతంగా వ్యాపించాయి, అవి అభిమానులలో భయాందోళనలకు కారణమయ్యాయి. చాలా మంది బతికే ఉన్నా, చనిపోయారంటూ వదంతులు సృష్టిస్తూ ఉన్నారు.
ఇటీవల, నటి కాజల్ అగర్వాల్ ప్రమాదంలో మరణించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి నటులు శోకంలో మునిగిపోయి ఉండడం, అంత్యక్రియలకు హాజరైనట్లు చూపించారు. కాజల్ అగర్వాల్‌కు నివాళి అర్పించారనే క్యాప్షన్లతో వైరల్ పోస్టులను షేర్ చేశారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. కాజల్ అగర్వాల్ బతికే ఉన్నారు, ఆ పుకార్లు నిరాధారమైనవి. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, తెలుగు నటులు వేర్వేరు అంత్యక్రియలకు హాజరైనట్లు చూపించే విజువల్స్ పాత వీడియోలే అని మేము గుర్తించాము.
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను చూపించే విజువల్ లెజెండరీ నటులు ఎన్టీ రామారావు 101వ పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్నదని మేము గ్రహించాం. స్వర్గీయ తారకరామారావుకు నివాళులు అర్పిస్తున్నప్పుడు తీసిన వీడియోను వైరల్ విజువల్స్ లా వాడుతూ ఉన్నారు.
రామ్ చరణ్ తన కారు దిగుతున్న దృశ్యం అతను తన అమ్మమ్మకు నివాళులర్పించే వీడియోలోనిది.
బాలకృష్ణ తన వదిన అంత్యక్రియల సమయంలో ఏడుస్తున్న దృశ్యమని తెలుస్తోంది. హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఎన్టీఆర్, బసవ రామ తారకం రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య నందమూరి పద్మజ ఆగస్టు 19న హైదరాబాద్‌లో 73 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె మరణానికి ముందు ఆసుపత్రికి తరలించారు. ఆమె బావమరిది నందమూరి బాలకృష్ణ, సంతాపం తెలియజేయడానికి వచ్చిన ప్రజలను పలకరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
కీవర్డ్‌లను ఉపయోగించి కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వెతికినప్పుడు, ఆమె బతికే ఉందని నిరూపించే అనేక ఇటీవలి పోస్ట్‌లు మాకు కనిపించాయి. ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో, మాల్దీవులలో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న చిత్రాలను పోస్ట్ చేశారు.
కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలలో తన మీద వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ పోస్టులు పెట్టారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆ వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని తెలిపారు. నేను ప్రమాదంలో ఉన్నానని వార్తలు నా దృష్టికి వచ్చాయి, అవి చూసి నవ్వుకున్నాను, ఎందుకంటే ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ ఉండదని కాజల్ అన్నారు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను, ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు, ప్రచారం కూడా చేయొద్దని మీ అందరినీ అభ్యర్థిస్తున్నానని కాజల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో నోట్ విడుదల చేశారు.
కనుక, నటి కాజల్ అగర్వాల్ కారు ప్రమాదంలో మరణించిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. బతికే ఉన్నారు.
Claim : నటి కాజల్ అగర్వాల్ ప్రమాదంలో మరణించారు, ఆమె అంత్యక్రియలకు అనేక మంది టాలీవుడ్ నటులు హాజరయినట్టు వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Fact Check : Unknown