ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ మీద అమెరికా చేసిన దాడులకు భారత్ ఎయిర్ స్పేస్ ను వినియోగించలేదు
ఇరాన్ మీద దాడి చేసే సమయంలో భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించిందనే
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది. భారీ బంకర్-బస్టర్ బాంబులను జారవిడిచాయి B-2 స్టెల్త్ బాంబర్లు. ఈ పని పూర్తీ చేశాక అమెరికా మిస్సోరీలోని తమ స్వస్థలానికి తిరిగి వచ్చాయి. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, ఏడు B-2 స్పిరిట్ విమానాలు ఆదివారం కాన్సాస్ నగరానికి ఆగ్నేయంగా 73 మైళ్ల దూరంలో ఉన్న వైట్‌మన్ వైమానిక దళ స్థావరంలో ల్యాండ్ అయ్యాయి. "ప్రపంచంలో మరో సైన్యానికి ఇలా చేసే సత్తా లేదు. ఇప్పుడు శాంతికి సమయం! ఈ విషయంలో మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు" అని చెబుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సైన్యాన్ని అభినందించారు. ఆపరేషన్‌లో ఉపయోగించిన B-2 స్టెల్త్ బాంబర్లు మిస్సోరీలో సురక్షితంగా తిరిగి ల్యాండ్ అయ్యాయని కూడా ఆయన ధృవీకరించారు.
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్‌గా పిలువబడే ఈ మిషన్ లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేసిన ఖచ్చితమైన దాడిగా అమెరికా అధికారులు తెలిపారు. అయితే గణనీయమైన నష్టం జరగలేదని ఇరాన్ తిరస్కరించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ, ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లోని మూడు అణు ప్రదేశాలపై బాంబు దాడి చేయడానికి ఏడు విమానాలు బేస్ నుండి ఇరాన్‌కు వెళ్లాయని చెప్పారు.
అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులతో ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భ అణుకేంద్రం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అమెరికా దాడిలో ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖ ద్వారాలు దెబ్బతిన్నాయి. పర్వతం కింద వంద మీటర్ల లోతులోని అణుకేంద్రం లక్ష్యంగా అమెరికా 14 బంకర్ బస్టర్ బాంబు దాడులు నిర్వహించగా, ఆ ప్రాంతంలో భారీ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా దాడికి ముందే అణుకేంద్రం ప్రవేశద్వారం మూసివేసినట్లు సమాచారం.
అయితే అమెరికా చేసిన ఆపరేషన్ కు భారత్ గగనతలాన్ని అమెరికా విమానాలు ఉపయోగించాయంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
భారత్ ఎయిర్ స్పేస్ ను ఉపయోగించినట్లుగా అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్ కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.
సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అధికారిక ప్రకటనలో వైరల్ అవుతున్న వాదనలను "నకిలీ" అని కొట్టిపారేసింది. "ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించలేదు" అని స్పష్టం చేసింది.
"ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో ఇరాన్‌పై విమానాలను ప్రయోగించడానికి అమెరికా భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకుందని అనేక సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి. ఈ వాదన అబద్ధం. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో అమెరికా భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించలేదు" అని పిఐబి వివరించింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లోని కీలకమైన అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు భారతదేశం దోహదపడిందని ఆరోపిస్తూ బహుళ ఆన్‌లైన్ పోస్ట్‌లు వెలువడిన నేపథ్యంలో భారత్ ఈ వాదనలను ఖండించాయి.
ఇక ఆపరేషన్ గురించి అమెరికా కూడా వివరించింది. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ సమయంలో అమెరికా భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించలేదు. ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ జనరల్ డాన్ కెయిన్ యుఎస్ విమానం ఉపయోగించే మార్గాన్ని వివరించారు.
ఆదివారం ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడుల తర్వాత అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ.. జనరల్ కెయిన్ ఆపరేషన్ వివరణాత్మక మ్యాప్, కాలక్రమాన్ని సమర్పించారు. ఇది US విమానాలు ఏవీ భారత గగనతలంలోకి ప్రవేశించలేదని చూపించింది. సుమారుగా సాయంత్రం 6:40 EST ఇరాన్ సమయం ప్రకారం తెల్లవారుజామున 2:10 గంటలకు B-2 రెండు విమానాలు ఫోర్డో వద్ద ఉన్న అనేక లక్ష్య పాయింట్లలో మొదటి దానిపై GBU 57 MOP (మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్) ఆయుధాలతో దాడి చేశాయి. మిగిలిన బాంబర్లు కూడా తమ లక్ష్యాలను ఢీకొట్టాయి. అందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని పలు మీడియా సంస్థలు, ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ధృవీకరించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇరాన్ మీద దాడి చేసే సమయంలో భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వాదనలు నిజం కాదు.
Claim : ఇరాన్ మీద దాడి చేసే సమయంలో భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించిందనే
Claimed By : Social Media Users
Fact Check : Unknown