ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ లోని రైల్వే స్టేషన్ పై దాడి జరగడంతో మంటలు అంటుకున్నాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఢిల్లీ లోని రైల్వే స్టేషన్ పై దాడి జరగడంతో మంటలు అంటుకున్నాయని, ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల ఘటన తర్వాత ఢిల్లీ లోని ఓ రైల్వే స్టేషన్ పై దాడి
నవంబర్ 10న జరిగిన ఢిల్లీ ఉగ్రవాద దాడి వెనుక ఉన్న వ్యక్తుల కోసం అధికారులు విచారణను ముమ్మరం చేశారు. వైద్యులతో కూడిన వైట్ కోట్ టెర్రర్ మాడ్యూల్‌పై దర్యాప్తు చేస్తున్నారు. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధం ఉన్న మరో రెండు రహస్య స్థావరాలకు సంబంధించిన సమాచారం కూడా దొరికింది.
గనై అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న ఒక మసీదు వెనుక ఉన్న పొలంలో 2,600 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను 12 రోజుల పాటు దాచిపెట్టి, దానిని ఫతేపూర్ టాగాలోని ఒక మతపెద్ద ఇంటికి తరలించారు. ఢిల్లీ పేలుడుకు ఒక రోజు ముందు దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడులో ఉపయోగించిన రసాయనం NIT నెహ్రూ గ్రౌండ్ నుండి సేకరించినట్లుగా దర్యాప్తు అధికారులు తెలిపారు. ఫరీదాబాద్‌లోని NIT నెహ్రూ గ్రౌండ్‌లో ఉన్న BR సైంటిఫిక్ అండ్ కెమికల్స్ అనే దుకాణంలో NIA దాడులు చేసింది. ఆ దుకాణం లైసెన్స్ పొందిన రసాయన వ్యాపారి లాల్ బాబు యాజమాన్యంలో ఉందని తెలుస్తోంది. ఈ దుకాణం వివిధ ఆసుపత్రులలోని ప్రయోగశాలలకు, అలాగే కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు రసాయనాలను సరఫరా చేస్తోంది.
ఓ వైపు అధికారులు విచారణ చేస్తూ ఉండగా, ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్ పై ఉగ్ర దాడులు చేశారనే వాదనతో వీడియోను వైరల్ చేస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లుగా ఆ వీడియో ఉంది. ఎర్రకోట సమీపంలో 15 మందికి పైగా మృతి చెంది, అనేక మంది గాయపడిన భారీ పేలుడు జరిగిన కొద్ది రోజులకే, న్యూఢిల్లీలోని ఒక రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగిందని నెటిజన్లు తమ పోస్టుల్లో చెబుతున్నారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులకు ఢిల్లీకి ఎలాంటి సంబంధం లేదు.
ఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందేమో అని తెలుసుకోడానికి మేము ప్రయత్నించగా ఎలాంటి నివేదికలు మాకు లభించలేదు. అలాంటి ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే తప్పకుండా నివేదికలు లభించి ఉండేవి.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
Sangbad Pratidin అనే యూట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 23, 2023న “Massive fire break out in Santoshpur station” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారని స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని బట్టి వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదని రెండు సంవత్సరాల కంటే ముందు నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని తెలుస్తోంది.

దీన్ని క్యూగా తీసుకుని సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేసాం. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన పలు మీడియా నివేదికలు లభించాయి.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సంతోష్‌పూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 6, 2023న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్‌లో రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో రద్దీగా ఉన్నప్పుడు మంటలు చెలరేగాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు అన్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న అనేక చిన్న దుకాణాలు మంటల్లో కాలిపోయాయని అధికారి తెలిపారు. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు, ఘటన జరిగిన రోజున రికార్డు అయిన వీడియోకు మధ్య పోలికలను ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టు:
2023 నాటి విజువల్స్ నుండి తీసుకున్న స్క్రీన్ షాట్:
ఇదే వీడియోను గతంలో భారతదేశంలోని పలు నగరాల్లో చోటు చేసుకున్న ప్రమాదాలుగా ప్రచారం చేశారు. వాటిని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండించాయి. అందుకు సంబంధించిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claim : ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల ఘటన తర్వాత ఢిల్లీ లోని ఓ రైల్వే స్టేషన్ పై దాడి జరిగింది
Claimed By : Social Media Users
Fact Check : Unknown