ఫ్యాక్ట్ చెక్: భోపాల్ లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని అధికారులు అరెస్టు చేశారన్న వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదు.
భోపాల్ లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని అధికారులు అరెస్టు
న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా భోపాల్ జిల్లా అంతటా పోలీసులు పెట్రోలింగ్, భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారు. ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్ సహా ఇతర నగరాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో భద్రతను పెంచారు, స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లను ఉపయోగించి ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రాష్ట్ర ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) అన్ని రైళ్లలోనూ, ముఖ్యంగా న్యూఢిల్లీ వైపు నుండి వచ్చే రైళ్లలో ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పది మందిని బలిగొన్న ఘోరమైన కారు పేలుడుకు దాదాపు నెల రోజుల ముందు భోపాల్‌లో ఉగ్రవాద కుట్ర బయటపడింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, మధ్యప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) సకాలంలో చర్య తీసుకోవడంతో, ISIS తో సంబంధం ఉన్న ఇద్దరు దొరికిపోయారు. భోపాల్‌కు చెందిన ఒకరు, ఢిల్లీకి చెందిన మరొకరు, ఉగ్రదాడిని అమలు చేయగలిగేలోపు ఆ ప్రణాళికను భగ్నం చేశారు.
అరెస్టు చేసిన వ్యక్తులను ఢిల్లీకి చెందిన మొహమ్మద్ అద్నాన్ అలియాస్ అబూ ముహారిబ్ (20), భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (21)గా గుర్తించారు. పండుగ సీజన్‌లో ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రజా ప్రాంతాల్లో ఇద్దరూ వరుస బాంబు పేలుళ్లకు ప్రణాళిక వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. CA (చార్టర్డ్ అకౌంటెన్సీ) పరీక్షకు సిద్ధమవుతున్న భోపాల్‌కు చెందిన అద్నాన్, ISIS అనుకూల ఆన్‌లైన్ గ్రూపులతో సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఢిల్లీలో అతని సహచరుడిని అరెస్టు చేసిన తర్వాత, దీపావళికి ముందు భోపాల్‌లోని కరోండ్ ప్రాంతం నుండి అతన్ని అరెస్టు చేశారు.
అయితే నడిరోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు గన్నులు పట్టుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
భోపాల్‌లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని, పేలుడుకు ముందే సీబీఐ, పోలీసుల సంయుక్త బృందం అతన్ని అరెస్టు చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది నిజమైన సంఘటన అనే వాదనతో ఈ పోస్ట్ షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో తెలుగు సినిమా లోని క్లిప్పింగ్
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటనను ఏ మీడియా సంస్థ కూడా ధృవీకరించలేదు.
భోపాల్‌లో బాంబు దాడికి ప్లాన్ చేసినందుకు ఆదిల్ కజ్మీ అనే వ్యక్తిని CBI అరెస్టు చేసినట్లు కూడా నివేదికలు ఏవీ కనుగొనలేకపోయాం.
ఇక వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. డిసెంబర్ 04, 2025 నాటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మాకు కనిపించింది. వైరల్ వీడియో ను వేరే కోణంలో ఆ వీడియో కనిపించింది.
నిజానికి ఈ వీడియో ఒక తెలుగు సినిమాకు సంబంధించింది. ఆ పాత్రను నటుడు సయ్యద్ ఆదిల్ కజ్మీ పోషించారు.
"This is the shot that’s going viral, and people are believing it’s real. But it’s actually from a movie, and the character is played by Syed Adil Kazmi — a respected act or and stunt rider.
#viralvideo #fakevideo #fakenews #biker #arrested #terrorist" అంటూ వీడియోను పోస్టు చేశారు.
మాకు లభించిన రిజల్ట్స్ లో Tappinchukoleru Latest Telugu Horror Movie 4K | Telugu New Horror Movies | Part 12 | Mango Videos అనే టైటిల్ తో మ్యాంగో వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసిన వీడియో కూడా లభించింది.
ఆదర్శ్, హరీష్ తెన్నేటి, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఫహీమ్ నటించిన తెలుగు సినిమా 'తప్పించుకోలేరు'. రుద్రపట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా లోని సన్నివేశమే ఇది.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో తెలుగు సినిమాలోని సన్నివేశం. నిజంగా భోపాల్ లో చోటు చేసుకున్న ఘటన కాదు.
Claim : భోపాల్ లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసి
Claimed By : Social media users
Fact Check : Unknown