ఫ్యాక్ట్ చెక్: ఐబొమ్మ రవికి తెలంగాణ పోలీసులు జాబ్ ఆఫర్ ను ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

తెలంగాణ పోలీసులు ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ను ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో

Update: 2025-12-06 06:26 GMT

ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్‌ పోలీసులు.

ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవి దాదాపు ప్రతి వారం కొత్త దేశానికి ప్రయాణిస్తూ విలాసవంతమైన జీవనశైలిని గడిపాడని పోలీసులు తెలిపారు. రవి నేరుగా సినిమాలను పైరసీ చేయలేదని, ఇతర వెబ్‌సైట్‌లు మరియు టెలిగ్రామ్ ఛానెల్‌ల నుండి వాటిని సేకరించి వాటి నాణ్యతను మెరుగుపరిచి ఐబొమ్మలో అప్‌లోడ్ చేశాడని విచారణలో తెలుసుకున్నారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లలో సర్వర్‌లను నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు కనుగొన్నారు.
రవి మొదట తన సొంత ఇమెయిల్ ID, డెబిట్ కార్డ్, వ్యక్తిగత వివరాలను ఉపయోగించి iBomma డొమైన్‌ను నమోదు చేసుకున్నాడు. వెబ్‌సైట్ తరువాత IPVolume ద్వారా హోస్ట్ చేశారు. ఇది బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను అందించింది. కంటెంట్ ప్లేస్‌మెంట్, యాడ్ పాప్-అప్‌లు, యూజర్ రీడైరెక్షన్‌ను నియంత్రించడానికి రవి కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS)ను ఉపయోగించాడు.
సినిమాను అప్‌లోడ్ చేసే ముందు, రవి ఒక పోస్టర్‌ను డిజైన్ చేసి రెండు లింక్‌లను సిద్ధం చేశాడు. ఒకటి స్ట్రీమింగ్ కోసం, మరొకటి డౌన్‌లోడ్ కోసం. నిఖిల్ అనే స్నేహితుడు కూడా పోస్టర్‌లను రూపొందించడంలో సహాయం చేశాడు. ఆ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిందని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.
అయితే ఐబొమ్మ రవికి హైదరాబాద్ పోలీసులు జాబ్ ఆఫర్ చేశారంటూ పలు కథనాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "పోలీసు ఉన్నతాధికారులు.. 'మీ తెలివితేటలు వృథా పోకూడదు. పోలీసు శాఖలోకి వచ్చి.. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మీకు మంచి జీతం కూడా ఇస్తాం' అని ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే రవి మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. 'నా ఐ బొమ్మ క్లోజ్ అయినా.. నా బ్రాండ్‌ను అంతర్జాతీయంగా మారుస్తాను. కరేబియన్ దీవుల్లో ఒక లగ్జరీ రెస్టారెంట్ పెడతాను. ఆ రెస్టారెంట్‌కు 'ఐ బొమ్మ' అనే పేరే పెడతాను. అక్కడ తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపిస్తాను. వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా ఆస్వాదిస్తాను' అని రవి చెప్పాడు" అని ఆ కథనాల్లో ఉన్నాయి.

పలు తెలుగు యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రముఖంగా ప్రచురించాయి.


Full View



ఆర్కైవ్ చేసిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 


వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు




 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న కథనాలలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ పోలీసులు ధృవీకరించారు.
ఈ వైరల్ పోస్టుల్లో నిజం ఎంత ఉందొ తెలుసుకోడానికి తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది. అయితే పోలీసులు ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. టెక్నికల్ ఎవిడెన్స్ ముందుపెట్టాక కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా సాక్షాలు సేకరణ జరుగుతోందని చెప్పారు. రవి మూడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. ఆ ప్రమోషన్‌ల ద్వారా వచ్చిన డబ్బుతోనే అతను లావిష్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇక సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఈ కథనాలను ఖండిస్తూ మీడియాకు వివరణ ఇచ్చినట్లుగా పలు కథనాలు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రవిని విచారించినప్పుడు అతనికి జాబ్ ఆఫర్ చేశారని, దాన్ని అతను తిరస్కరించాడని వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి చాలా తక్కువ ప్రశ్నలకే సమాధానం ఇచ్చాడని, అతనిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించలేదని తెలిపారు. అంతేకాకుండా, రవి మూడు బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేసినట్టు తమ విచారణలో తేలిందని అరవింద్ బాబు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన వివరించారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  అలాంటిది ఏమీ లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు
Claimed By :  Social Media Users, Telugu Media
Fact Check :  Unknown
Tags:    

Similar News