ఫ్యాక్ట్ చెక్: ఇండిగో సంక్షోభం సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్టేజీ మీద డ్యాన్స్ చేస్తూ కనిపించాడంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు
దేశంలోని పలు విమానాశ్రయాలలో పెద్ద ఎత్తున ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇండిగో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 10, 2025 నాటి ఉత్తర్వుల్లో, విమానాల ఆలస్యం, రద్దుల వల్ల ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని పరిష్కరించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది.
ఈ బృందంలో డిప్యూటీ, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లు సహా సీనియర్ అధికారులు ఉంటారు. ఈ బృందం నుండి ఇద్దరు సభ్యులు ప్రతిరోజూ గుర్గావ్‌లోని ఎమ్మార్ క్యాపిటల్ టవర్ 2లోని ఇండిగో కార్పొరేట్ కార్యాలయంలో ఉంటారు. మొత్తం విమానాల సంఖ్య, నెట్‌వర్క్ వివరాలు, పైలట్ల సంఖ్య, సిబ్బంది లభ్యత, స్టాండ్‌బై సిబ్బంది, విధుల విభజన, ప్రణాళిక లేని సెలవులు వంటి కీలక అంశాలను సమీక్షిస్తారు. మొత్తం రోజువారీ విమానాలు, అందుబాటులో ఉన్న సిబ్బంది, ఉద్యోగుల కొరత కారణంగా ప్రభావితమైన రంగాలను కూడా అధికారులు పర్యవేక్షిస్తారు.
పర్యవేక్షణ బృందంతో పాటు, DGCA డిప్యూటీ డైరెక్టర్ (AED) ఐశ్వర్ సింగ్, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మణి భూషణ్‌లను నియమించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రద్దుకు సంబంధించిన పరిస్థితిని ట్రాక్ చేయడం, విమానయాన సంస్థలు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా డబ్బులను రిటర్న్ చేయడం, సకాలంలో పనితీరు, పౌర విమానయాన అవసరాల కింద ప్రయాణీకులకు అందించే పరిహారం, సామాను తిరిగి చేర్చడాన్ని పర్యవేక్షించనున్నారు.
ఇండిగో సంక్షోభం తర్వాత సివిల్ ఏవియేషన్ మినిష్టర్ రామ్ మోహన్ నాయుడుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన రాజీనామా చేయాలంటూ పలువురు నేతలు కూడా డిమాండ్ చేశారు. ప్రయాణీకులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు స్టేజీ మీద డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్కైవ్ అవుతున్న లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. గతంలో చోటు చేసుకున్న వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ వీడియోలో నుండి స్క్రీన్ షాట్స్ తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఇండిగో వైఫల్యానికి నెలల ముందు, జూలై నెలలో పలు తెలుగు మీడియా ఛానల్స్ వీడియోను అప్‌లోడ్ చేశాయి. ఇది ఇటీవలి ఇండిగో సంక్షోభానికి సంబంధం లేదని స్పష్టంగా సూచిస్తుంది.
ఈ డ్యాన్స్ కు సంబంధించిన పలు మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీగా సేవలందిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు.. డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో తన బంధువుల వివాహానికి హాజరైన మంత్రి.. వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారని Oneindia జులై 29, 2025న నివేదించింది.
తన బాబాయ్ కింజరాపు ప్రభాకరరావు కుమారుడు వివాహ వేడుకకు సంబంధించి జరిగిన సంగీత్ ఫంక్షన్‌లో స్టెప్పులేసి ఇరగదీశాడు రామ్మోహన్ నాయుడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలోని ఓ పాటకు మంత్రి అచ్చెన్నాయుడు కుమారులతో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేశాడని టీవీ9 జులై 29, 20225న నివేదించింది
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన సోదరుడు పెళ్లి వేడుకలలో భాగమయ్యారు. విజయనగరం జిల్లాలోని సన్ రే రిసార్ట్‌లో జరిగిన ప్రభాకర రావు కుమారుడి సంగీత్ ఫంక్షన్‌లో పాల్గొని డాన్సులతో సందడి చేశారు. ఫంక్షన్‌లో సాంప్రదాయ కుర్తా పైజామా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజ్ పై రామ్మోహన్ నాయుడు వేసిన స్టెప్పులు ఆశ్చర్యానికి గురి చేశాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఇండిగో సంక్షోభం నెలకొనడం కంటే ముందే రామ్ మోహన్ నాయుడు చేసిన డ్యాన్స్ వీడియోలు ఆన్ లైన్ లో ఉన్నాయి.
ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడు స్పందన:
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది పూర్తిగా ఆ సంస్థ అంతర్గత వైఫల్యమేనని, ఏఎంఎస్‌ఎస్ (AMSS) సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు కారణం కాదని, సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలోని సమస్యలే దీనికి కారణమని ఆయన రాజ్యసభలో తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Claim : ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం పాత వీడియో. ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది
Claimed By : Social Media Users
Fact Check : Unknown