ఫ్యాక్ట్ చెక్: సముద్రంలో సరికొత్త యాపిల్ ఐఫోన్స్ లభించాయంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
ఐఫోన్లను తీసుకుని వెళుతున్న కంటైనర్ కు రంధ్రం పడడం
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించడం గురించి ఐఫోన్ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోప్యతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వినియోగదారులను హెచ్చరించింది. ఐఫోన్ కంపెనీ తమకు సంబంధించిన సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుతోంది.
మరో వైపు యాపిల్ సంస్థ నుండి సీనియర్ ఉద్యోగులు వరుసగా వైదొలుగుతున్నారు. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలక ఇంజినీర్లు వెళ్ళిపోడానికి సిద్ధమయ్యారు. కృత్రిమ మేధ విభాగానికి చెందిన జాన్ జియానాండ్రియా, ఇంటర్‌ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు.
మరో వైపు యాపిల్ ఐఫోన్స్ సముద్రంలో తేలియాడుతూ ఉండగా కొందరు వాటిని తీసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సముద్రంలో ఓ కంటైనర్ నుండి ఐఫోన్లు బయటకు రావడం వైరల్ వీడియోలో చూడొచ్చు.
"కార్గో నౌక నుండి పడిపోయిన ఐఫోన్ కంటైనర్..
వైరల్ గా మారిన వీడియో!
#viralvideo #iphones #uanow" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే ఇలా సముద్రంలో ఐఫోన్స్ తేలియాడుతూ ఉన్నట్లుగా మాకు ఎలాంటి అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో వీడియోలు, మీడియా కథనాలు లభించలేదు. ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది.
వైరల్ అవుతున్న వాదనను ధృవీకరించడానికి మాకు విశ్వసనీయమైన కథనాలు ఏవీ దొరకలేదు.
వీడియోలో పలు తప్పులు మాకు కనిపించాయి. ఆపిల్ లోగో అస్పష్టంగా ఉండటం, కంటైనర్ నుండి ఫోన్‌లను తీసేటప్పుడు వ్యక్తి చేయిలో తేడాలు కనిపించడం లాంటివి గమనించాం.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు
AI-జనరేటెడ్ విజువల్స్ లో ఇటువంటి తప్పులను మనం తరచుగా గమనించవచ్చు.
వైరల్ వీడియోను AI-డిటెక్షన్ ప్లాట్‌ఫామ్ హైవ్ మోడరేషన్‌లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఇది వైరల్ క్లిప్ AIని ఉపయోగించి సృష్టించినట్లుగా స్పష్టం చేసింది. వీడియో AI-జనరేటెడ్ అని తేల్చింది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో వెతకగా, అ వీడియో అసలైన వెర్షన్ మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లభించింది.
Oye_sanki_1 అనే పేజీలో ఈ వీడియోను 29 నవంబర్ 2025న అప్లోడ్ చేశారు. ఈ పేజీ బయోలో ‘Experiments in Artificial Intelligence’ అని రాసి ఉంది. దీన్ని బట్టి వీడియోలను ఏఐ ద్వారా సృష్టించారని తెలుస్తోంది.
https://www.instagram.com/p/DRoH44AExlX/
ఇక ఈ ఇన్స్టా పేజీని నిశితంగా పరిశీలించగా ఎన్నో వీడియోలను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది.
https://www.instagram.com/p/
ఇక ఈ ఇన్స్టా పేజీని నిశితంగా పరిశీలించగా ఎన్నో వీడియోలను ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
Claim : ఐఫోన్లను తీసుకుని వెళుతున్న కంటైనర్ కు రంధ్రం పడడం
Claimed By : Social Media Users
Fact Check : Unknown