ఫ్యాక్ట్ చెక్: ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుండి 65కి పెంచినట్లు ప్రచారంలో ఉన్న జీఓ నకిలీది

ప్రస్తుత కూటమి ప్రభుత్వం (తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో) ఎన్నికల ముందు ప్రకటించిన "సూపర్ సిక్స్" హామీలలో- 20 లక్షల

Update: 2025-09-02 10:22 GMT

 retirement age to 65    

ప్రస్తుత కూటమి ప్రభుత్వం (తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో) ఎన్నికల ముందు ప్రకటించిన "సూపర్ సిక్స్" హామీలలో- 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం, నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతి, మహిళలకు ఆర్థిక సహాయం (అడబిడ్డ నిధి) కింద నెలకు ₹1,500, తల్లికివందనం పథకంలో పేద తల్లులకు సంవత్సరానికి ₹15,000, రైతులకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సాయం (అన్నదాత సుఖీభవ) ఇవ్వడం, ప్రతి కుటుంబానికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు (దీపం 2.0), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం, దీపం 2.0, ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్నాయి. అయితే నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు సృష్టి, అడబిడ్డ నిధి ఇంకా ప్రారంభం కాలేదు.

ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసినట్లు ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ జీఓ నిజమని భావించి కొంతమంది దాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను తాకట్టు పెట్టిందని ఆరోపిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఋట్.ణో.1575, తేదీ 29.08.2025 అనే నంబర్‌తో జీఓను షేర్ చేశారు. దీనిలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచే ఉద్దేశంతో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శిస్తున్నారు.



క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

ఈ వాదనలో నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆగస్టు 29న ఎలాంటి జీఓ ను విడుదల చేయలేదు. కీవర్డ్ సర్చ్ చేయగా, ఇలాంటి ఏ మార్పు గురించి వార్తా కథనాలు మాకు లభించలేదు.

మేము కనుగొన్న సమాచారం ప్రకారం, నిజమైన జీఓ RT.NO.1545, తేదీ 22.08.2025న విడుదలైంది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన మాత్రమే ఉంది. దీనిపై ఈనాడు ఆగస్టు 30న కథనం ప్రచురించింది.

తెలంగాణ టుడే ప్రకారం, సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్న 62 నుండి 65 సంవత్సరాలకు పెంచినట్లు ఉన్న జీఓ నకిలీదని, అలాంటి జీఓను ప్రభుత్వం జారీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అదేవిధంగా, డెక్కన్ క్రానికిల్ ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే అంశంపై మూడు సభ్యుల మంత్రివర్గ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి కే. విజయానంద్ జీఓను జారీ చేశారు.

ప్రభుత్వం కూడా అధికారికంగా స్పష్టం చేస్తూ “పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఒక నకిలీ జీఓ సృష్టించబడింది. ఆ జీఓ RT.NO.1575, తేదీ 29.08.2025 తప్పుడు జీఓ. అసలు జీఓ RT.NO.1545, తేదీ 22.08.2025 మాత్రమే నిజమైనది. ఇందులో 60 నుండి 62 సంవత్సరాలకు పెంచినట్లు మాత్రమే ఉంది. తప్పుడు జీఓలు సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అధికారిక ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఖాతా FactCheck.AP.Gov.in ద్వారా హెచ్చరించింది

కనుక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసినట్లు వచ్చిన వార్త తప్పుడు. అసలు జీఓ ప్రకారం 60 నుండి 62 సంవత్సరాలకు మాత్రమే పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

Claim :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ జీఓ జారీ చేసింది
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News