ఫ్యాక్ట్ చెక్: నేపాల్ కు చెందిన వీడియోను ఇరాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్న ఘటనగా ప్రచారం చేస్తున్నారు

నేపాల్ కు చెందిన వీడియోను ఇరాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్న

Update: 2026-01-28 10:37 GMT

ఇరాన్ దేశంలో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ దేశ ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అంతం చేయడానికి ఓ వైపు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితికి కారణమవుతాయా అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి.


ఇరాన్‌తో యుద్ధం ముప్పు, పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్య మధ్యప్రాచ్యంలో వైమానిక దళ విన్యాసాలను అమెరికా ప్రకటించింది. ఈ విన్యాసాలను అమెరికా తొమ్మిదవ వైమానిక దళం నిర్వహిస్తోంది, దీనిని ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ (AFCENT) అని కూడా పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ యొక్క వైమానిక భాగం. అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ మధ్యప్రాచ్యానికి చేరుకుందని, ఈ ప్రాంతంలో యుద్ధ సామగ్రిని పెంచిందని అమెరికా సైన్యం చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

2025 డిసెంబర్ చివరలో ఆర్థిక సమస్యలపై ఇరాన్‌లో నిరసనలు చెలరేగాయి. అయితే అవి ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా మారాయి, జనవరి 8 నుండి అనేక రోజుల పాటు భారీగా వీధుల్లో ప్రదర్శనలు కొనసాగాయి. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ అశాంతికి సంబంధించిన ఘటనల్లో 6,000 కంటే ఎక్కువ మరణాలను ధృవీకరించిందని తెలిపింది. నిరసనలు తీవ్రమవుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులను చంపవద్దని టెహ్రాన్‌ను పదే పదే హెచ్చరించారు, హింస కొనసాగితే అమెరికా సైనికపరంగా జోక్యం చేసుకుంటుందని అన్నారు.

వందలాది మంది వ్యక్తులు పర్వతాన్ని ఎక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. హింస నుండి తప్పించుకోవడానికి ఇరానియన్లు పారిపోతున్నట్లు ఈ వీడియోలో ఉందని ఆరోపించారు.

ఈ పోస్టుల్లో "వేల మంది ఇరానియన్లు తమ ప్రాణాలను కాపాడుకోడానికి టెహ్రాన్ నుండి పర్వతాలలోకి పారిపోతున్నారు. దయచేసి ఇరాన్ ప్రజల కోసం ప్రార్థించండి" అని శీర్షిక ఉంది.
వైరల్ పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్
ఇక్కడ
, ఇక్కడ ఉన్నాయి.

ఇక వైరల్ స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇరాన్ కు చెందినది కాదు. ఇరాన్ లో అల్లర్లు మొదలవ్వడానికి ముందు నుండే ఈ వీడియో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.


వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జూన్ 2, 2025 నాటి 'మేడ్ ఇన్ నేపాల్' అనే ఖాతా ద్వారా అదే క్లిప్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్లు మాకు తెలిసింది.

డోల్పా ప్రాంతంలోని ప్రజలు యార్సగుంబా అనే అరుదైన, అత్యంత విలువైన ఔషధ శిలీంధ్రాన్ని వెతకడానికి అక్కడ ఉన్నారు. దీనిని "హిమాలయన్ గోల్డ్" అని కూడా పిలుస్తారు. యార్సగుంబా 3,000 - 5,000 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. దీనికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రకటించారు.

Full View


మే 29, 2025న, డోల్పా అనే ఫేస్‌బుక్ పేజీ కూడా ఈ వీడియోను షేర్ చేసింది. ఇది నేపాల్ కు సంబంధించిందని ధృవీకరిస్తుంది. ఈ వీడియో ఇరాన్‌లో కొనసాగుతున్న హింసకు చాలా ముందు నాటిదని ఈ పోస్ట్‌లు రుజువు చేస్తున్నాయి.




ప్రతి సంవత్సరం, రూప పటాన్ తో సహా డోల్పా ఎత్తైన ప్రాంతాలలో అరుదైన యార్సగుంబ కోసం ప్రజలు పరిగెత్తుతూ ఉంటారు. డోల్పా, పొరుగు జిల్లాలైన రుకుమ్, జాజర్‌కోట్, జుమ్లా నుండి గ్రామస్తులు ఈ ఆల్పైన్ పచ్చికభూములకు కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు, తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. వారాలపాటు కఠినమైన పరిస్థితులను భరిస్తారు. యార్సగుంబ సేకరణ నుండి వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది, ఆ ఆదాయం కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా మారుతుంది. ఈ అన్వేషణ అంత ఎత్తులో ఎన్నో సవాళ్లతో నిండి ఉంది, ఈ సమాజాలు ఆర్థిక మనుగడ కోసం ప్రమాదాలను సైతం పట్టించుకోవని వివరించారు.

యార్సగుంబ కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన పలు వీడియోలను ఇక్కడ చూడొచ్చు.

Full View


Full View


Full View


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ఇరాన్ కు సంబంధించింది కాదు. నేపాల్ లో ప్రజలు అరుదైన అత్యంత విలువైన ఔషధ శిలీంధ్రాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.


Claim :  నేపాల్ కు చెందిన వీడియోను ఇరాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్న
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News