Vijayawada : నేడు గాయత్రీదేవిగా దుర్గామాత
నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది
Vijayawada Kanaka Durga temple
శరన్నావరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. దీంతో పెద్ద సంఖ్యలో రెండో రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే బెజవాడ ఇంద్రకీలాద్రిపై బారులు తీరారు. ఈరోజు గాయత్రీ పఠనం అందరూ చేయాల్సి ఉంటుందని చెబుతారు.
కనకాంబర పూలతో...
నేడు అమ్మవారిని కనకాంబర పూలతో పూజిస్తే మంచిదని చెబుతారు. నిన్నటి నుంచి దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అధికారులు అన్నీ ఏర్పాట్లు చేయడంతో పాటు అంతరాలయం దర్శనానికి ఎవరినీ అనుమతించడం లేదు. నేడు కొబ్బరి అన్నం ప్రసాదంగా తినిపించాలని పండితులు చెబుతున్నారు.