Dussehra : నేడు విజయదశమి
నేడు దసరా పండగ. దేశ వ్యాప్తంగా ప్రజలు విజయదశమి పండగను జరుపుకుంటున్నారు
నేడు దసరా పండగ. దేశ వ్యాప్తంగా ప్రజలు విజయదశమి పండగను జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయదశమి నాడు ఈ పండగ చేసుకుంటారు. ఈరోజంతా మంచిదేనని పండితులు చెబుతున్నారు. ఈరోజు దుర్గామాత ప్రజల సంక్షేమం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ పండగ చేసుకుంటారు. చెడుపై సాధించిన విజయంగా ఆనందంగా జరుపుకుంటారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆయుధ పూజ నేడే...
ఈరోజు తమ వృత్తికి ఉపయోగపడే ఆయుధాలను దైవంగా భావించి వాటికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనిని ఆయుధ పూజ అంటారు. తమ వృత్తిలో ఉపయోగించే ఆయుధాలకు పూజలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి పిండివంటలు నివేదించి నేడు ప్రసాదంగా సమర్పించాలంటారు. రాక్షసులను దుర్గామాత సంహరించిన రోజు కావడంతో విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటారు.