Indrakiladri : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? ఏరోజు వెళితే శుభప్రదమంటే?

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

Update: 2025-09-22 02:23 GMT

దసరా అంటే ముందుగా గుర్తుకొచ్చేది విజయవాడ ఇంద్రకీలాద్రి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లిని దసరా నవరాత్రుల్లో దర్శించుకోవడం పుణ్యంగా భావిస్తారు. నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తుల సౌకర్యం కోసం పాలకమండలితో పాటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

22వ తేదీ నుంచి...
ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ శరన్నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై జరగనున్నాయి. మొత్తం పదకొండు రోజులు పాటు శరన్నవరాత్రులు జరగనున్నాయి. రోజుకో అలంకారంతో దుర్గమాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. చూసే వారికి కన్నుల పండువగా కనిపించే ఈ అలంకారాలతో దుర్గమ్మ మరింత ధగ ధగ మెరుస్తూ దర్శనమిస్తుంది. తొలి రోజు బాలా త్రిపుర సుందరిగానూ, రెండో రోజు గాయత్రీ దేవి రూపంలోనూ, మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు కాత్యాయని దేవిగా, ఐదో రోజు మహాలక్ష్మి అవతారంలోనూ, ఆరో రోజు శ్రీలలితా త్రిపుర సుందరి దేవిగా, ఏడో రోజు మహా చండీదేవిగా, ఎనిమిదో రోజు సరస్వతిదేవీగా, తొమ్మిదో రోజు దుర్గాదేవిగా, పదవ రోజు మహిషాసుర మర్ధనిగా, పదకొండో రోజు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
లక్షల సంఖ్యలో...
దీంతో ఇంద్రకీలాది లో జరిగే శరన్నవరాత్రులకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారికి నవరాత్రుల సమయంలో దుర్గమ్మ వద్దకు వచ్చితమ మొక్కులు చెల్లించుకుంటారు. లక్షలాది మంది భక్తులు కొండపైకి వస్తుండటంతో క్యూ లైన్లతో పాటు తీర్థ ప్రసాదాలను కూడా ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినా ప్రత్యేకంగా అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే ప్రాధమిక చికిత్స జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను కూడా దుర్గగుడిపై ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా మూలా నక్షత్రం రోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి భారీ బందోబస్తుతో పాటు ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీను నాయక్ తెలిపారు.
రోజుకు లక్ష మందికిపైగానే...
వీవీఐపీ వాహనాలను తప్పించి ఇంద్రకీలాద్రిపైకి ఈ నవరాత్రుల్లోనూ ఏ వాహనాన్ని అనుమతించే అవకాశం ఉండదు. భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో రావాలి. లేకుంటే కాలినడకన చేరుకోవాలి. అంతే తప్ప సొంత వాహనాలను అనుమతించరు. శరన్నవరాత్రులు జరిగే ప్రతి రోజూ రోజుక లక్షా 70 వేల మంది దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సెకనుకు ఇద్దరు ముగ్గురు భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు వచ్చినప్పుడు కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News