బెజవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల అలంకారాలు ఇవే

విజయవాడ దుర్గమ్మ దసరా 2025 ఉత్సవాల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి

Update: 2025-08-22 02:00 GMT

  rajarajeshwari devi

విజయవాడ దుర్గమ్మ దసరా 2025 ఉత్సవాల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాల శోభ మొదలు కానుంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులపాటు అమ్మవారు పదకొండు అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అలంకారాలు ఇలా
సెప్టెంబర్ 22 – బాలత్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్23 – గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24 – అన్నపూర్ణాదేవి
సెప్టెంబర్ 25 – కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26 – మహాలక్ష్మి
సెప్టెంబర్ 27 – లలితా త్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 28 – మహాచండి దేవి
సెప్టెంబర్ 29 – సరస్వతి దేవి
సెప్టెంబర్ 30 – దుర్గాదేవి
అక్టోబర్ 1 – మహిషాసుర మర్దిని
అక్టోబర్ 2 – రాజరాజేశ్వరి దేవి
అక్టోబర్ 2న ఉదయం 9:30కి పూర్ణాహుతి తో దసరా ఉత్సవాలు ముగియనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంస వాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.






Tags:    

Similar News