నేడు హైదరాబాద్ లో బతుకమ్మ ఉత్సవాలు

నేడు హైదరాబాద్ లోని సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం జరగనుంది

Update: 2025-09-29 03:40 GMT

నేడు హైదరాబాద్ లోని సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం జరగనుంది. సరూర్ నగర్ స్టేడియంలో్ బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం పది వేల మందితో బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించింది. నేడు సరూర్ నగర్ స్టేడియంలో్ బతుకమ్మ కార్నివాల్‌ జరగనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గిన్నిస్ బుక్ రికార్డు కోసం...
పదివేల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలు నేడు జరగనున్నాయి. బతుకమ్మ వేడుకలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వేలాది మంది ఈ వేడుకకు హాజరు కానున్నారు.


Tags:    

Similar News