Telangana : జనం పల్లెబాట - దసరా సెలవులు నేటి నుంచి

నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు

Update: 2025-09-21 02:30 GMT

నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. నిన్న రాత్రి నుంచి బస్సులు, రైళ్లలో అనేక మంది ప్రజలు తమ స్వగ్రామాలకు బయలుదేరగా, ఈరోజు సొంత వాహనాల్లో బయలుదేరారు. గ్రామాల్లో దసరా పండగను నిర్వహించుకునేందుకు ఒక్కసారి వాహనాలు రోడ్డు మీదకు రావడంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది.

టోల్ ప్లాజాల వద్ద రద్దీ...
తెలంగాణలో పెద్ద పండగ కావడంతో సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఏర్పడింది. తెలంగాణలో తమ సొంత గ్రామాలకు వెళ్లి పండగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. బతుకమ్మ పండగ కూడా నేటి నుంచి ప్రారంభం కానుండటంతో జనం పల్లె బాట పట్టారు. పదమూడు రోజుల పాటు సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు బయలుదేరారు.


Tags:    

Similar News