Indrakiladri : కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రి నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు

Update: 2025-10-02 04:56 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రి నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. నవరాత్రులు నేటితో ముగియనుండటంతో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. విజయదశమినాడు దుర్గామాత శ్రీరాజ రాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణ భక్తులకు తోడు భవానీ మాల వేసుకున్న భక్తులు కూడా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

వీఐపీ దర్శనాలు రద్దు...
దీంతో అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కొండ కిక్కిరిసిపోయింది. వీఐపీ, ప్రొటోకాల్ దర్శనం కూడా రద్దు చేశారు. అయితే సాయంత్రం జరగాల్సిన జలవిహారాన్ని కూడా రద్దు చేశారు. కృష్ణానదిలో వరద తీవ్రత కారణంగా అధికారులు హంసవాహనంపై జలవాహనాన్ని అధికారులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు


Tags:    

Similar News