Vijayawada : నేడు మహిషాసుర మర్ధిని రూపంలో దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహిషాసుర మర్ధిని రూపంలో కనిపించనున్నారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహిషాసుర మర్ధిని రూపంలో కనిపించనున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా నేడు మహిషాసుర మర్ధిని అలంకారంలోదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జాము నుంచే బారులుతీరారు.
రెండు నుంచి మూడు గంటలు...
క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఈరోజు నవమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించిన అధికారులు అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అవసరమైన మజ్జిగ, మంచినీరు వంటి ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. ఈరోజు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దీంతో లడ్డూ ప్రసాదాల తయారీని కూడా అధికంగా చేశారు. నిన్న రాత్రి లక్ష మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.