Vijaywada : నేడు దుర్గాష్టమి... దుర్గమాతగా అమ్మవారు

నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Update: 2025-09-30 02:02 GMT

నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు దుర్గాష్టమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారు. నిన్న మూలా నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి పన్నెండు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు దుర్గాష్టమి కావడంతో ఎక్కువ భక్తులు వస్తారని భావిస్తున్నారు.

అధిక సంఖ్యలో భక్తులు....
భక్తులు ఈరోజు కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశముందని భావించిన అధికారులు అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు కూడా భక్తులు లక్షకు మందికిపైగా వస్తారని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను చేశారు. వీవీఐపీల కోసం మాత్రం ప్రత్యేకంగా కొన్ని సమయాలను కేటాయించారు. ఆ సమయంలోనే నేడు వారు కొండ మీదకు వచ్చి దుర్గామాతను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచే విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.


Tags:    

Similar News