రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్...ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూలా నక్షత్రం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూలా నక్షత్రం కావడంతో భక్తుల అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వినాయకుడి విగ్రహం నుంచి రెండు కిలోమీటర్ల మేరకు భక్తులు క్యూ లైన్ లో నిల్చుని ఉన్నారు. వీఎంసీ హోల్డింగ్ ఏరియాల్లోల్లోని కంపార్టుమెంట్లలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రి పరిసరాల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించార. ఉదయం 7.15 వరకు అమ్మవారిని 55,513 మంది భక్తులు దర్శించుకున్నాకె,
మూలానక్షత్రం...
మూలా నక్షత్రం రోజు రెండు లక్షలమంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు కొండపైకి వీవీఐపీ వాహనాలు మినహా ఇతర వాహనాలు నిషేధించారు.భక్తుల రద్దీని కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదనపు బలగాల సాయంతో భక్తుల రద్దీని పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు. మధ్యాహ్నానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని తెలిసింది.