జగన్మాత దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు... దర్శనానికి ఎంత సమయం అంటే?

ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో్ భక్తులు చేరుకున్నారు

Update: 2025-09-28 05:00 GMT

ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో్ భక్తులు చేరుకున్నారు. జగన్మాత దర్శనానికి క్యూలైన్లలోభక్తులు ఉదయం నుంచి వేచిచూస్తున్నారు. జై భవాని నామస్మరణతో క్యూలైన్లు మార్మోగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఏడో రోజు శ్రీ మహా చండీ దేవి అవతారంలో దుర్గామాత ఆదివారం భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణంగానే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే నవరాత్రి ఉత్సవాలు నేడు ఆదివారం కావడంతో ఉదయం మూడుగంటల నుంచి భక్తజన సందోహం తాకిడి పెరిగింది. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

అధికారులు సమన్వయంతో...
ఈరోజు భక్తజన సందోహం ఎక్కువగా ఉంటుందని ఊహించిన ఆలయ అధికారులు ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవడంతో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు సాధారణ భక్తులకు అవసరమైన వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేయడం విశేషం. సాధారణ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వయంగా చూసేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రతిరోజు సాధారణ భక్తులతో కలిసి క్యూ లైన్ లో వెళ్తున్నారు.
భక్తులు ఇబ్బందులు పడకుండా...
భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎక్కడైనా ఏదైనా లోపం కనిపిస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. సోమవారం మూలా నక్షత్రం కావడంతో దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకు సన్నద్ధమయ్యారు. అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్టీఆర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ లు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకుంటూ ఉండటంతో దేవాలయానికి విచ్చేసిన ప్రతి భక్తుడు సంతృప్తికర దర్శనం చేసుకుంటున్నారు.
Tags:    

Similar News