నేడు విజయ దశమి.. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. కొండ కింది నుంచి పై వరకూ క్యూలైన్లు కిక్కిరిసి..

Update: 2022-10-04 23:30 GMT

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. నేడు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో.. చేతిలో చెరుకుగడతో.. భక్తులకు అభయమిస్తూ శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి పులిహోర, లడ్డూ, బూరెలు, గారెలు, అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. కొండ కింది నుంచి పై వరకూ క్యూలైన్లు కిక్కిరిసి ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం కృష్ణానదిలో హంసవాహనంపై అమ్మవారికి సేవ చేయనున్నారు. కానీ ఈ సారి వరద నేపథ్యంలో వాహనం స్థిరంగానే ఉంటుంది. పులిచింతల నుంచి అధికంగా వరద వస్తున్న నేపథ్యంలో.. కృష్ణానదిలో అమ్మవారి విహారానికి జలవనరుల శాఖ అనుమతి నిరాకరించింది.
శ్రీశైలంలో..నేడు విజయ దశమి.. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు భ్రమరాంబదేవిగా నిజరూపాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారికి నందివాహన సేవ నిర్వహిస్తూ.. ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు.


Tags:    

Similar News