లలితా త్రిపురసుందరీ దేవి గా దర్శనమిస్తోన్న దుర్గమ్మ

చెరుకు గడ, పూలను చేతబూని అభయ, వరముద్రలతో అమ్మవారు భక్తులను కరుణిస్తుంది. ఈ రోజు అమ్మవారికి..

Update: 2022-09-30 00:00 GMT

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ కనకదుర్గ అమ్మవారు దేవీ నవరాత్రుల్లో భాగంగా.. ఐదవ రోజు అమ్మవారు భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం , బింబాధరం పృథుల మౌక్తికశోభినాసమ్‌
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీ (లలిత త్రిపుర సుందరి దేవీ) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కుంకుమ రంగు చీరను ధరించి నాలుగు భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ, వరముద్రలతో అమ్మవారు భక్తులను కరుణిస్తుంది. ఈ రోజు అమ్మవారికి దద్దోజనం, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
శ్రీశైలంలో..
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వరోజు భ్రమరాంబిక దేవి స్కంద మాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు నేడు శేష వాహన సేవ నిర్వహిస్తారు.







Tags:    

Similar News