దుర్గమ్మ దర్శనం.... ప్రతి రోజూ ప్రత్యేక చీర

దుర్గగుడి శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి రకరకాలుగా నైవేద్యాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది

Update: 2023-10-13 04:15 GMT

దుర్గగుడి శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి వివిధ రకాలుగా నైవేద్యాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టి దుర్గమ్మ ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఏ రోజు ఏ నైవైద్యం పెట్టాలనేది ముందుగానే నిర్ణయించి దానిని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ప్రతి ఏటా ఇదే పద్ధతిలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంటారు. రుచిగా, శుచిగా నైవేద్యాన్ని దుర్గమ్మకు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఏ రోజు ఏ నైవేద్యాన్ని అమ్మవారికి పెడతారన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కోరోజు
అలాగే నవరాత్రుల్లో ప్రతి రోజూ ఒక రంగు చీర కడతారు. తొమ్మిది అలంకారాలకు తొమ్మిది రకాలు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దుర్గమ్మను దర్శించుకునే వారికి ఈ నవరాత్రుల్లో ఇవి ప్రత్యేకం. ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సందర్భంగా చీరతో పాటు నైవేద్యం కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా తెప్పించిన చీరలను అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు అలంకరిస్తారు. ఒక్కోరోజు ఒక్కోరంగు చీరతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకునే అవకాశముండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి రోజు: బంగారు రంగు చీర, కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం నైవేద్యం
రెండో రోజు : లేత గులాబీ రంగు చీర, పులిహోర నైవేద్యం
మూడో రోజు : కాషాయం లేదా నారింజరంగు చీర, కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం నైవేద్యం
నాలుగో రోజు : గంధపురంగు లేదా పసుపురంగు చీర, పరమాణ్ణం, దద్దోజనం, గారెలు నైవేద్యం
ఐదో రోజు : కుంకుమ రంగు చీర, నైవేద్యంగా దద్దోజనం, క్షీరాన్నం గా సమర్పిస్తారు.
రో రోజు : గులాబీ రంగు చీర, చక్కెర పొంగలి, క్షీరాన్నాన్ని నైవైద్యంగా సమర్పిస్తారు
ఏడో రోజు : తెలుపురంగు చీర, కేసరి, పరమాన్నం, దద్దోజనం నైవేద్యం
ఎనిమిదో రోజు : ఎరుపు రంగు చీర, కదంబం, శాకాన్నం నైవేద్యం
తొమ్మిదో రోజు : ముదురు ఎరుపురంగు చీర, చక్కెర పొంగలి నైవేద్యం
పదో రోజు : ఆకుపచ్చ రంగు చీర, పులిహోర, లడ్డూ, బూరెలు, గారెలు, అన్నం నైవేద్యం


Tags:    

Similar News